తేలని గజ లెక్క | - | Sakshi
Sakshi News home page

తేలని గజ లెక్క

Jun 4 2026 4:52 AM | Updated on Jun 4 2026 4:52 AM

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో ఏనుగుల లెక్క ఇంకా తేలనంటోంది. గజగణనలో భాగంగా అటవీ శాఖ వైల్డ్‌ లైఫ్‌, ప్రాజెక్టు ఎలిఫెంట్‌ విభాగాలు మే 27, 29, 30 తేదీల్లో మూడు దశల్లో జిల్లాలో ఏనుగుల గనణ చేపట్టారు. జిల్లా అటవీశాఖ పరిధిలోని చిత్తూరు ఈస్ట్‌, వెస్ట్‌, పలమనేరు, కుప్పం, పుంగనూరు, కార్వేటినగరం రేంజ్ల పరిధిలో సిబ్బంది ఏనుగుల గణన నిర్వహించారు. అయినా ఇంతవరకు ఎన్ని ఏనుగులు ఉన్నాయో చెప్పలేకపోతున్నారు. దీనిపై డీఎఫ్‌ఓ సుబ్బరాజు స్పందిస్తూ సాంకేతికంగా వివరాలు తెలిశాక, ఉన్నతాధికారులకు పంపి తర్వాత చెబుతామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement