నేటి నుంచి టీచర్లకు శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఎస్జీటీ టీచర్లకు నేటి నుంచి ఈనెల 9వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.
కుప్పం: కుప్పం నియోజకవర్గంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు వల్ల 500 కుటుంబాలు వీధిన పడుతాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్‌కు రైతులు వినతి పత్రం సమర్పించారు. బుధవారం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. శాంతిపురం మండలం దండికుప్పం, సోన్నేగానిపల్లి, అమ్మవారిపేట, రామకుప్పం మండలం మణీంద్రం గ్రామాలకు చెందిన 500 కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని పేర్కొన్నారు. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కాంట్రాక్టర్ కేంద్ర ప్రభుత్వంలో కుదుర్చుకున్న ఒప్పదం ప్రకారం 150 కి.మీ దూరంలో 2033 వరుకు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాంచరాదన్నారు. 2024లో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని, దీన్ని ప్రకారం 2033 వరుకు ఎయిర్ పోర్టు నిర్మాణం జరగకూడదన్నారు. స్థానిక రైతులు వ్యవ సాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని, ఈ పొలాలు ఎయిర్‌పోర్టుకు వెళితే తాము తీవ్రంగా నష్టపోతామని వాపోయారు.


