గ్యాస్‌ సరఫరాలో అంతరాయం | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సరఫరాలో అంతరాయం

Jun 3 2026 12:15 AM | Updated on Jun 3 2026 12:15 AM

● 46 మద్యం బాటిళ్లు స్వాధీనం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలో ఇండియన ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌) కంపెనీకి చెందిన ట్రానన్స్‌పోర్టర్లతో నెలకొన్న వివాదం గ్యాస్‌ సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తోంది. ఈనెల 1వ తేదీ నుంచి జిల్లాకు గ్యాస్‌ సిలిండర్ల రవాణా నిలిచిపోవడంతో డీలర్లు, వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఐఓసీఎల్‌ కంపెనీ, ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్ల మధ్య టెండర్‌ ఒప్పందాలకు సంబంధించిన అంశాలపై వివాదం నెలకొన్నట్లు డీలర్లు చెబుతున్నారు. రవాణా చార్జీలు, అన్‌లోడింగ్‌ వ్యయాలు, చెల్లింపుల విధానం తదితర అంశాల్లో ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తడంతో గ్యాస్‌ రవాణా నిలిచిపోయినట్లు డీలర్లు చెబుతున్నారు. దీంతో జిల్లాలోని ఏజెన్సీలకు సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్టు సమాచారం. ఏజెన్సీల వద్ద ప్రస్తుతం ఉన్న నిల్వలు ఒకటి, రెండు రోజులకు మాత్రమే సరిపోతాయని, బుధవారం నుంచి గ్యాస్‌ కొరత మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఐఓసీఎల్‌కు చెందిన సుమారు 27 గ్యాస్‌ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా రోజువారీగా సుమారు 20 వేల గృహ వినియోగ సిలిండర్లు పంపిణీ అవుతున్నాయి. ప్రస్తుతం సరఫరా నిలిచిపోవడంతో వేలాది మంది వినియోగదారులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. దీనిపై సంబంధిత అధికారులు సైతం చేతులెత్తేస్తున్నట్టు సమాచారం.

వర్సిటీలో యోగా పరీక్షలు

కుప్పం: ద్రవిడ వర్సిటీలో డిప్లొమా ఇన్‌ యోగా పరీక్షలను వర్సిటీ వీసీ మల్లయ్య మంగళవారం ప్రారంభించారు. మంగళవారం నుంచి 6వ తేదీ వరకు వరుకు జరుగునున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భాష భవనంలో యెగా పరీక్షలు విజయవంతం కావడానికి ఏర్పాట్లు పూర్తిచేసినట్టు పేర్కొన్నారు. ప్రాక్ట్రికల్స్‌కు కావాల్సిన సాంకేతిక పరమైన ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు.

భూ సర్వేకు ఆరు నెలలే గడువు

చిత్తూరు కలెక్టరేట్‌ : రాబోయే ఆరు నెలల్లో రీ సర్వే పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం హడావుడి చేస్తోంది. రీ సర్వే ఆఖరులో తప్పు లు చేయకూడదని కలెక్టరేట్‌ అధికారులు సూచిస్తున్నారు. రీ సర్వేలో నమోదయ్యే ఫిర్యాదుల ను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రీ సర్వే డీటీలను ఆదేశించారు.

మా జీతాల్లో కోత వద్దు

చిత్తూరు కార్పొరేషన్‌: ఉద్యోగుల అనుమతి లేకుండా హాఫ్‌–డే జీతం మినహాయించే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ట్రాన్స్‌కో ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఇది చట్ట, రాజ్యాంగపరంగా తప్పని పేర్కొంది. ‘విద్యుత్‌ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం‘ అనే సొసైటీ నిర్వహణ కోసం ప్రతి ఉద్యోగి జీతం నుంచి అర్ధరోజు జీతాన్ని ఇవ్వాలని యాజమాన్యం కోరడం సరికాదన్నారు. అందుకు కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులు అనుకూలంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం రావలసిన మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పీఆర్సీ ఊసే లేదన్నారు. వీటి సాధన కోసం పోరాడాలన్నారు.

బెల్టుషాపు పై దాడి

బంగారుపాళెం: మండలంలోని తుంబకుప్పం గ్రామంలో మంగళవారం బెల్ట్‌షాప్‌పై దాడిచేసి మద్యంబాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. తుంబకుప్పం గ్రామంలో శ్రీధర్‌ అనే వ్యక్తి అక్రమంగా ఆంధ్ర మద్యం విక్రయిస్తున్నాడని అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలసి దాడి చేశామన్నారు. 46 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. వీటి విలువ రూ.8,920 ఉంటుందన్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ పేర్కొన్నారు.

ఆటో బోల్తా

– ముగ్గురికి గాయాలు

వి.కోట : ఆటో బోల్తా పడడంతో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురుకి స్వల్ప గాయాలైన ఘటన మండలంలో మంగళవారం చోటు చెసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కుప్పం నుంచి వి.కోట వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటో కుప్పం– వి.కోట జాతీయ రహదారిలోని పొంతనపల్లి క్రాస్‌ వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పోతనపల్లికి చెందిన అణమ్మ, కృష్ణప్పతోపాటు డ్రైవర్‌ అరుణ్‌కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement