చిత్తూరు రూరల్ (కాణిపాకం): ల్యాబ్ టెక్నీషియన్లు బాధ్యతగా పనిచేయాలని జిల్లా క్షయ నివారణ అధికారి జి. వెంకటప్రసాద్ సూచించారు. చిత్తూరులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన ల్యాబ్ టెక్నీషియన్లతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. క్షయవ్యాధి నియంత్రణలో భాగంగా రెండు వారాలకు పైగా దగ్గుతో బాధపడుతున్న వారి నుంచి తప్పనిసరిగా కఫం నమూనాలు సేకరించి స్పుటం పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారిని వెంటనే ఎస్‌టీఎస్‌కు నివేదించి డాట్స్ చికిత్సకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షల విషయంలో ఐసీటీసీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు ముందస్తు కౌన్సెలింగ్ అందించి, గోప్యత పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పాజిటివ్ కేసులను వెంటనే ఏఆర్టీ కేంద్రాలకు రిఫర్ చేయాలని సూచించారు. గర్భిణులకు పీపీటీసీటీ కార్యక్రమం కింద హెచ్‌ఐవీ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ నెల మలేరియా నివారణ మాసోత్సవం సందర్భంగా అధిక ప్రమాద ప్రాంతాలను గుర్తించి విస్తృత స్థాయిలో రక్త పరీక్షలు నిర్వహించాలని సూచించారు. జిల్లా మలేరియా అధికారి నవీన్ తేజ్‌రాయల్, జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.
ముగిసిన పినాకా ఉచిత శిక్షణ
నగరి : మున్సిపల్ పరిధి, పుదుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 21 రోజుల పాటు నిర్వహించిన ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులు మంగళవారం ముగిశాయి. తిరుపతి ఎకై ్సజ్ సీఐ లీలారాణి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. శిక్షణ కార్యక్రమాన్ని విద్యార్థులు వారి ఉన్నతికి, లక్ష్య నిర్దేశానికి చక్కగా వినియోగించుకోవాలన్నారు. క్విజ్, గ్రూప్ డిస్కషన్ నిర్వహించి విజేతలకు ప్రశంసాపత్రం, నగదు బహుమతిని అందజేశారు. ఎంఈవో నమఃశ్శివాయం, ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, కోర్సు డైరెక్టర్ మునస్వామి, ఫ్యాకల్టీ మధుసూదన్, బాలాజి పాల్గొన్నారు.


