లీకుల డీఎస్సీపై.. | - | Sakshi
Sakshi News home page

లీకుల డీఎస్సీపై..

Jun 2 2026 3:06 AM | Updated on Jun 2 2026 3:06 AM

డీఎస్సీ నియామకాలపై సీబీఐ

విచారణకు డిమాండ్‌

విద్యాశాఖ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే

వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఫైర్‌

నిరసన ర్యాలీని ప్రారంభించిన

విజయానందరెడ్డి

నిరసన ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి

చిత్తూరు కలెక్టరేట్‌ /చిత్తూరు కార్పొరేషన్‌: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం దగా డీఎస్సీకి తెరలేపిందని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువకులు నిరసన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమాన్ని చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి జెండా ఊపి ప్రారంభించగా.. ఆయనతో పాటు నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్‌, గుడిపాల మండల పార్టీ అధ్యక్షుడు ప్రకాష్‌, నాయకులు రజనీకాంత్‌ పాల్గొన్నారు. యువత విభాగం చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడు మనోజ్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల యువత అధ్యక్షులు, నిరుద్యోగులు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా యువత విభాగం రీజనల్‌ కోఆర్డినేటర్‌ హేమంత్‌రెడ్డి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు మిన్నటించారు. లోకేష్‌కి ఉద్యోగం.. నిరుద్యోగులకు శఠగోపం, క్రీడా మైదానంలో అడుగు పెట్టని వారికి ఫిట్‌ సర్టిఫికెట్లా? అంటూ విరుచుకుపడ్డారు. అలాగే ఉద్యోగాలు ఇవ్వకపోతే ఉరే గతి అంటూ కలెక్టరేట్‌ ఎదుట ఉరితాళ్లతో వినూత్నంగా నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీకి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో రాష్ట్ర కమిటీ సభ్యులు దొరబాబు, జిల్లా కమిటీ సభ్యులు సుబ్రమణ్యంనాయుడు, ధనరాజ్‌, నాయకులు చంద్రారెడ్డి, స్టాండ్లీ పాల్గొన్నారు.

పోస్టులు అమ్ముకున్నారు

చంద్రబాబు సర్కారులో మెగా డీఎస్సీ పేరుతో టీచర్‌ పోస్టులను అమ్ముకున్నారని వైఎస్‌ఆర్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇస్తామని అభ్యర్థులను దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. డీఎస్సీలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. డీఎస్సీ అవకతవకలు, అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించి డిమాండ్‌ చేశారు.

పేపర్‌ లీక్‌..డేటా డిలీట్‌.. మెరిట్‌లిస్ట్‌ మాయంపై మండిపాటు

ఎన్నికల్లో బీఎల్‌ఏలే కీలకం

కుప్పం రూరల్‌ : ఎన్నికల ప్రక్రియలో బీఎల్‌ఏలే కీలకమని ఎమ్మెల్సీ భరత్‌, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, ఎస్‌ఐఆర్‌ ట్రైనర్‌ వజ్ర భాస్కర్‌రెడ్డి తెలిపారు. కుప్పం పట్టణంలోని కేవీఆర్‌ కల్యాణ మండపంలో సోమవారం కుప్పం నియోజకవర్గంలోని బీఎల్‌ఏ, క్లస్టర్‌ ఇన్‌చార్జిలకు శిక్షణ నిర్వహించారు. వారు మాట్లాడుతూ తమిళనాడు ఎన్నికల్లో 38 వేల ఓట్ల తొలగింపు కారణంగా స్టాలిన్‌ 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని గుర్తుచేశారు. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ, ఢిల్లీలో అరవింద్‌ క్రేజీవాల్‌ సైతం తొలగించిన ఓట్లు కారణంగానే ఓడిపోయినట్టు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేస్తోందన్నారు. బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement