సకాలంలో విద్యుత్‌ సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

సకాలంలో విద్యుత్‌ సమస్యల పరిష్కారం

Jun 2 2026 3:06 AM | Updated on Jun 2 2026 3:06 AM

చిత్తూరు కార్పొరేషన్‌: విద్యుత్‌ సమస్యలను సకాలంలో పరిష్కారించాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిండ్ర మండలం నుంచి వ్యవసాయ సర్వీసు పరంగా ఉన్న ఫిర్యాదును పరిష్కారించి సర్వీసు ఇవ్వాలని సుబ్బారామిరెడ్డి, బంగారుపాళ్యం నుంచి ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసిన వాటికి కనెక్షన్‌ ఇవ్వలేదని ప్రభాకర్‌రెడ్డి సమస్యలను తెలియజేశారు. అలాగే వెదురుకుప్పం వ్యవసాయ సర్వీసుకు డబ్బులు కట్టి ఏడాది అవుతున్నా కనెక్షన్‌ ఇవ్వలేదని పట్టాభి పేర్కొన్నారు. వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని ఎస్‌ఈ అధికారులను ఆదేశించారు.

షెడ్డు కూలి రెండు

పాడి ఆవులు మృతి

పెనుమూరు(కార్వేటినగరం): గాలీవానకు ఆవుల షెడ్డు కూలి రెండు పాడి ఆవులు మృతి చెందిన ఘటన సోమవారం పెనుమూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు కథనం.. పెనుమూరు మండల పరిఽధిలోని మఠంపల్లి గ్రామానికి చెందిన సురేష్‌నాయుడు ఏర్పాటు చేసిన ఆవులు షెడ్డు గాలివానకు నేలకొరిగింది. అందులో ఉన్న పాడి ఆవులు రెండు షెడ్డు శిథిలాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాయి. షెడ్డుకు ఏర్పాటు చేసిన రేకులు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ మేరకు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు బాధితుడు వాపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement