నేడు కరెంటోళ్ల జనబాట | - | Sakshi
Sakshi News home page

నేడు కరెంటోళ్ల జనబాట

Jun 2 2026 3:06 AM | Updated on Jun 2 2026 3:06 AM

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలోని 40 సెక్షన్ల పరిధి లో కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌ బాబు తెలిపారు. అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకొనున్నట్టు వెల్లడించారు.

నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి

చిత్తూరు కలెక్టరేట్‌: బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలు పొందిన విభిన్న ప్రతిభావంతులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు పాల్గొన్నారు.

జ్యూస్‌ తాగి

వంద మందికి పైగా అస్వస్థత

బైరెడ్డిపల్లె: బైరెడ్డిపల్లె మండలం పాతపేటలో సోమవారం జ్యూస్‌ తాగి వంద మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వివరాలు.. పాతపేటలో బాట గంగమ్మ జాతర జరుగుతోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలకు నీళల్లో జ్యూస్‌ పౌడర్‌ కలిపి పంపిణీ చేశారు. ఆ జ్యూస్‌ తాగిన వారిలో 100 మందికి పైగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ బైరెడ్డిపల్లె, పలమనేరు ప్రభుత్వాస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప బైరెడ్డిపల్లె ప్రభుత్వాస్పత్రికి చేరుకొని.. వారిని పరామర్శించారు. అందుబాటులో లేని మందులను ప్రైవేటు మెడికల్‌ షాపుల నుంచి తీసుకువచ్చి అందించారు. గడువు ముగిసిన జ్యూస్‌ పౌడర్‌ వల్లే అస్వస్థతకు గురయ్యారని స్థానికులు చెబుతున్నారు. కాలం చెల్లిన వస్తువులు విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement