భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం

Jun 1 2026 12:20 AM | Updated on Jun 1 2026 12:20 AM

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ అనుబంధ శ్రీదేవి, భూ దేవి సమేత వరదరాజస్వామి ఆలయంలో ఆదివారం పౌర్ణమిని పురస్కరించుకుని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. వ్రతంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని ద ర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల శ్రేయస్సు, లోక కల్యాణం కోసం ప్రత్యే క ప్రార్థనలు చేసినట్లు అధికారులు తెలిపారు.

ముగిసిన రెసిడెన్షియల్‌ ఖో–ఖో శిక్షణ శిబిరం

చిత్తూరు కలెక్టరేట్‌ : స్థానిక పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నెల రోజుల రెసిడెన్షియల్‌ ఖో–ఖో వేసవి క్రీడా శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. ఈ శిబిరంలో జిల్లా నలుమూలల నుంచి దాదాపు 80 మంది బాలబాలికలు శిక్షణ పొందారు. మెసానికల్‌ మైదానంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. అనంతరం క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయ్‌ భాస్కర్‌, జిల్లా ఖో–ఖో అసోసియేషన్‌ సెక్రటరీ బాలాజి, ఫిజికల్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement