ఇసుక లారీ సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇసుక లారీ సీజ్‌

Jun 1 2026 12:20 AM | Updated on Jun 1 2026 12:20 AM

నిండ్ర (నగరి) : ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్లు నిండ్ర ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ నగరి– ఊత్తుకోట రోడ్డులోని ఒరూరుపేట గ్రామ సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టామన్నారు. నగరి నుంచి ఇసుక లోడుతో వెళుతున్న లారీని ఆపామన్నారు. పోలీసులను చూసిన డ్రైవర్‌, మరొక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. లారీలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించి సీజ్‌ చేశామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement