నేడు కలెక్టరేట్‌ వద్ద నిరసన | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌ వద్ద నిరసన

Jun 1 2026 12:14 AM | Updated on Jun 1 2026 12:14 AM

చిత్తూరు కార్పొరేషన్‌: డీఎస్సీ మోసాలపై సోమ వారం ఉదయం 9.30 గంటలకు చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్టు వైఎస్సార్‌ సీపీ చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు మనోజ్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా యువత, డీఎస్సీ అభ్యర్థులతో కలిసి అమూల్‌ డెయిరీ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేసి అక్కడ నిరసన తెలుపనున్నట్టు వెల్లడించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తామన్నారు. కార్యక్రమానికి యువత రీజనల్‌ కోఆర్డినేట్‌ హేమంత్‌రెడ్డితో పాటు జిల్లాలోని నియోజకవర్గాలు, మండలాల యువత అధ్యక్షులు హాజరవుతారని, యువకులు, డీఎస్సీ అభ్యర్థులు, బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయపద్రం చేయాలని కోరారు.

ప్రభుత్వ విద్యుత్‌ సర్వీసులకు ప్రీ పెయిడ్‌ విధానం

తిరుపతి రూరల్‌: ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలోని నెల్లూ రు, తిరుపతి, చిత్తూ రు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని ప్రభుత్వ విద్యుత్‌ సర్వీసులకు స్మార్ట్‌ మీటర్ల ద్వారా ప్రీపెయిడ్‌ విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్‌ వర్క్స్‌, వీధి దీపాలు తదితర సర్వీసులకు స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలో 4,735 సర్వీసులకు రూ.1.19 కోట్లు, తిరుపతి జిల్లాలో 4,942 సర్వీసులకు రూ.2.29 కోట్లు, చిత్తూరు జిల్లాలో 4,193 సర్వీసులకు రూ.1.63 కోట్లు, అన్నమయ్య జిల్లాలో 4,324 సర్వీసులకు రూ.1.68 కోట్లు, కడప జిల్లాలో 4,520 సర్వీసులకు రూ.1.98 కోట్లు, అనంతపురం జిల్లాలో 2,829 సర్వీసులకు రూ.1.41 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 2,432 సర్వీసులకు రూ.88.81 లక్షలు, కర్నూలు జిల్లాలో 3,243 సర్వీసులకు రూ.1.63 కోట్లు, నంద్యాల జిల్లాలో 3,278 సర్వీసులకు రూ.1.54 కోట్లతో సంస్థ రీచార్జ్‌ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement