– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
ఇసుకారులపై కేసు నమోదు
ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హిటాచీ, టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నష్టం మిగిల్చిన గాలీవాన
జిల్లాలో శనివారం కురిసిన గాలీవాన రైతుల కు నష్టం మిగిల్చింది. చెట్ల నుంచి పెద్ద ఎత్తున మామిడి కాయలు రాలిపోయాయి.
ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా లోని ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో రికార్డుల దందా కొనసాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైసలిస్తే చాలు ఇక్కడ ఎలాంటి రికార్డయినా మారిపోతుందని, అవసరమైతే రికార్డులను పూర్తిగా తొలగించేస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారిక సిబ్బందితో పాటు ప్రైవేట్ దళారులు కుమ్మకై ్క రికార్డుల గదులను తమ అడ్డాగా మార్చుకున్నారు. రికార్డుల్లో అర్హులైన పేదల పేర్లను కొట్టేస్తూ, పాత తేదీలతో ఫోర్జరీ సంతకాలు సృష్టిస్తూ ల్యాండ్ మాఫియాకు పాల్పడుతున్నారు. వాటాలు వెళ్తుండడంతో అధికారులు మిన్నకుండిపోతున్నట్లు చర్చ నడుస్తోంది.
పాత రికార్డులకు భలే డిమాండ్!
కొత్త ఫైళ్ల కంటే, గతంలో ఉన్న పాత రికార్డుల మార్పిడికే ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పితే పాత భూ ము ల వివరాలు, యాజమాన్య హక్కులను రాత్రికి రాత్రే మార్చేస్తున్నట్లు సమాచారం. గతంలో పనిచేసిన అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రికార్డుల అవసరాలున్న బాధితులను, కోర్టు కేసుల్లో ఉన్న రెవెన్యూ సమస్యల రికార్డులను అధికా రుల అనుమతి లేకుండానే బయటకు పంపుతున్నారు. ముడుపులను బట్టి రికార్డులను చేరవేస్తున్నారు.
పైసలిస్తే ప్రభుత్వ భూములకూ స్కెచ్!
చిత్తూరు శివారుతోపాటు, జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న భూములు, ప్లాట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రభుత్వ భూములు, వంక పోరంబోకు భూములకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది సిబ్బంది డబ్బులు తీసుకుని ఇళ్ల పట్టాలకు సంబంధించిన రికార్డులను మార్చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో పనిచేసిన అధికారులతో సంతకాలు చేయించి ఇళ్ల స్థలాల రిజిస్టర్లలో లబ్ధిదారుల పేర్లను కొట్టేసి ఇతరుల పేర్లు ఎక్కిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ, అసైన్డ్ భూములకు పెరిగిన డిమాండ్‌ను కొంతమంది రెవెన్యూ సిబ్బంది ఆసరాగా తీసుకుంటున్నారు. భూములకు రక్షణగా, సామాన్యుడి ఆస్తికి భరోసాగా ఉండే రికార్డులను ఇష్టానుసారంగా మార్చేస్తున్నారు. నిరుపేదల గుండెల్లో మంటలు పుట్టిస్తున్నారు. రికార్డుల మాయాజాలంపై ఉన్నతాధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టకపోవడంతో వల్లే రికార్డులు చేతులు మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రికార్డు గదుల్లో దళారులు
వాస్తవానికి కార్యాలయంలోని రికార్డు గదిలోకి సెక్షన్ ఉద్యోగులు తప్ప మరెవరూ వెళ్లడానికి వీలు లేదు. ఆర్‌ఐలు, తహసీల్దార్లు, ఇతరత్రా అధికారులు, ఉద్యోగుల ప్రైవేట్ డ్రైవర్లు, ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్లు రికార్డు గదుల్లోకి దూరిపోతున్నారు. తద్వారా తమ పనులను చక్కబెట్టుకుంటున్నారు. తహసీల్ధార్ కార్యాలయంలో ఉండాల్సిన రికార్డులను ప్రైవేట్ వారికి ఇచ్చి పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.


