చిత్తూరు కలెక్టరేట్ : డీఈవో రాజేంద్రప్రసా ద్ సేవలు మరువలేనివని డీఆర్‌వో మోహన్‌కుమార్ తెలిపారు. చిత్తూరులోని జెడ్పీ కార్యాలయంలో శనివారం డీఈవో ఉద్యో గ విరమణ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్‌వో మాట్లాడుతూ విద్యావ్యవస్థలో ఎంతో మంది ఆర్‌జేడీ స్థాయి అధికారులకే రాజేంద్రప్రసాద్ గురువుగా నిలిచారని పేర్కొన్నారు. జిల్లాలో అతితక్కువ కాలం డీఈవోగా పనిచేసినా విద్యాశాఖలో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. సమగ్రశిక్ష శాఖ ఏపీ సీ వెంకటరమణ మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ వివాదాల జోలికి పోకుండా విధులను నిర్వహించి అందరి మన్ననలు పొందారని తెలిపారు. అనంతరం డీఈఓ రాజేంద్రప్రసాద్ దంపతులను ఘనంగా సత్కరించారు. డీవైఈవో ఇందిర, ఏడీలు సుకుమార్, వెంకటేశ్వరరావు, సైనిక సంక్షేమ శాఖ అధికారి రాఘవులు, వయోజన విద్య శాఖ డీడీ ఆజాద్, సంఘం నాయకులు జీవీ రమణ, గంటామోహన్, మురళీమోహన్, డీఈవో కార్యాలయం సూపరింటెండెంట్లు స్వర్ణకుమారి, రవిశేఖర్, గోపాల్, చైతన్య, రమేష్, కుమార్ పాల్గొన్నారు.
ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య
తవణంపల్లె : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చారాల ఎస్సీ కాలనీలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేష్‌బాబు కథనం మేరకు.. చారాల ఎస్సీ కాలనీకి చెందిన త్యాగరాజ్ కుమారుడు విక్కీ, కావ్య(24) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కావ్య పలుమార్లు ఒత్తిడి తెచ్చినా విక్కీ అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఇంటిలో ఉరివేసుకుంది. స్థానికులు గమనించి తలుపులు పగులగొట్టి అరగొండ అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


