తిరుపతి అర్బన్ : తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం విద్యాసంస్థల్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపుతున్నారని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి ప్రశంసించారు. ఆయన శనివారం విశ్వం స్కూల్‌లో విశ్వం సైనిక్– నవోదయ 2026 బ్రోచర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకు లు, శాసీ్త్రయ బోధనా విధానం, సమగ్ర కోచింగ్ ద్వారానే ఈ స్థాయి విజయాలు సాధ్యమని తెలిపారు. విశ్వం విద్యా సంస్థల అధినేత విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ సైనిక్ స్కూల్, నవోదయ, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ప్రవేశ పరీక్షలకు సంబంధించి అదనపు సమాచారం కోసం 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు. విశ్వచందన్‌రెడ్డి, రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.
ఇసుకారులపై కేసు నమోదు
తవణంపల్లె: మండలంలోని గోవిందరెడ్డిపల్లె సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేసి మూడు టిప్పర్లు, ఒక హిటాచీని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ ముందుగా అందిన సమాచారం మేరకు దాడి చేశామన్నారు. బంగారుపాళ్యం మండలం సదకుప్పానికి చెందిన హరిప్రసాద్‌నాయుడు, శెట్టేరికి చెందిన బి.బాబు(43), వి.గిరి(31), ఎగువ రాగిమానుపెంటకు చెందిని ఆర్.మధునాయుడు(41), బీహార్ రాష్ట్రానికి చెందిన నితీష్‌కుమార్(31)పై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. హరిప్రసాద్ నాయుడుకు చెందిన మూడు టిప్పర్లు, ఒక హిటాచీని స్వాధీనం చేసుకున్నామన్నారు.


