రేపు ఎస్‌ఐఆర్‌పై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

రేపు ఎస్‌ఐఆర్‌పై శిక్షణ

May 31 2026 1:54 AM | Updated on May 31 2026 1:54 AM

● పెద్దిరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, రెడ్డెప్ప రాక ● అందరూ హాజరుకావాలి ● విజయానందరెడ్డి

చిత్తూరు కార్పొరేషన్‌: చిత్తూరు నియోజకవర్గంలోని బీఎల్‌ఏలకు సోమవారం ఎస్‌ఐఆర్‌పై శిక్షణ ఇస్తున్నట్టు వైఎస్సార్‌ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ సోమవారం ఉదయం 11 గంటలకు సంతపేటలోని ఆర్‌ఆర్‌గార్డెన్స్‌లో సమావేశం ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని బీఎల్‌ఏలు, డివిజన్‌, పంచాయతీ ఇన్‌చార్జిలకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే శిక్షకులు వజ్రా భాస్కర్‌రెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పిస్తారని తెలిపారు. అలాగే పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి్‌, మాజీ ఎంపీ రెడ్డెప్ప, జిల్లా బూత్‌ కమిటీ అధ్యక్షుడు వెంకటేష్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. కార్యక్రమ పనులను పార్టీ నగర అధ్యక్షుడు కేపీశ్రీధర్‌, నియోజకవర్గ బూత్‌ కమిటీ కన్వీనర్‌, మాజీ కార్పొరేటర్‌ మధురెడ్డి, మండలాల బూత్‌ కమిటీ కన్వీనర్లు విజయ్‌, అరవింద్‌ పర్యవేక్షిస్తారని వెల్లడించారు. అందరూ కార్యక్రమానికి హాజరై అవగాహన పెంచుకోవాలని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement