చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రమైన చిత్తూరులోని వేపమాను వీధిలో ఉన్న స్కూల్ ఆఫ్ చెస్‌లో జూన్ 4వ తేదీన ఆల్ చిత్తూరు చెస్ డెవలప్‌మెంట్ అసోసియేష న్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్–15 చెస్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్రా చెస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, ఏసీసీడీఏ ప్రెసిడెంట్ ఎస్.ఆర్.బి. ప్రసాద్ తెలిపారు. వారు శనివారం విలేకరులతో మాట్లాడా రు. 4వ తేదీ ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయన్నారు. ఈ టోర్నమెంట్‌లో చిత్తూరు జిల్లా కు చెందిన క్రీడాకారులు మాత్రమే పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు జూన్ 13, 14 తేదీల్లో గుడివాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి చెస్ ఛాంపియన్‌్‌షిప్ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని వెల్లడించారు. ఆసక్తి ఉన్న అండర్–15 క్రీడాకారులు తమ పేర్లను జూన్ 3వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నేరుగా రాలేని వారు తమ పు ట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాన్ని వాట్సాప్ నంబర్ 9849313676కు పంపాలన్నారు. వివరాలకు 90004 75799లో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో చెస్ అసోషియేషన్ సభ్యులు ఎస్.ఆర్.దినేష్ తదితరులు పాల్గొన్నారు.


