విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఖాకీలు..
ఘటనపై విచారణకు ఆదేశం
‘పచ్చ’ మహిళకు గంజాయి ఇవ్వడానికి వచ్చిన స్మగ్లర్..?
గతంలో అవినీతి మరకలతో
ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై చర్యలు
భర్తీకి నోచుకోని ఇన్‌స్పెక్టర్ పోస్టు..
ఇన్‌చార్జ్‌తో సరి
ఆ స్మగ్లర్‌కు సరుకు ఇవ్వడానికే..?
చిత్తూరులోని అధికార పార్టీకి చెందిన ఒక మహిళా గంజాయి స్మగ్లర్‌కు సరుకును అప్పగించడానికే ఈ ఇద్దరు యువకులు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గంజాయి విక్రయించడంలో ఆరితేరి, సెటిల్‌మెంట్ల వైపు అడుగులు వేస్తున్న ఆ మహిళ భారీగా గంజాయిని చిత్తూరుకు తెప్పించడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. కళాశాల యువకులను తన చేతుల్లో పెట్టుకుని ఇంజినీరింగ్ విద్యార్థులకు గంజాయి అమ్మడం, బస్టాండు, రైల్వే స్టేషన్లకు గంజాయిని సరఫరా చేయడం ఆమె ప్రవృత్తి. పైకి మాత్రం టీడీపీ నేతలకు ఫ్లెక్సీలు కట్టడం, మహిళా నాయకురాలిగా చెలామణి అవుతోంది. ఆ మహిళ గుట్టును ఖాకీలు రట్టు చేస్తారో? లేదో చూడాలి.
చిత్తూరు అర్బన్: చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ తరచూ వార్తల్లోకెక్కుతోంది. ఇక్కడ పనిచేసే అధికారుల్లో కొందరు అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం.. మరికొందరు విధుల్లో నిర్లక్ష్యం చూపడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా పోలీస్ స్టేషన్ నుంచి ఒక గంజాయి స్మగ్లర్ తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని ఎస్పీ డూడీ సీరియస్‌గా తీసుకున్నారు. ‘హద్దు’లు దాటి..
జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను కట్టడి చేయడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఇటీవల యాదమరికి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలో గంజాయి నిర్మూలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చిత్తూరు ప్రాంతం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దు కావడంతో ఈ మార్గంలో గంజాయి విచ్ఛలవిడిగా దిగుమతి అవుతోంది. పైగా ఉత్తరాంధ్ర, ఒడిశా నుంచి బెంగళూరుకు చిత్తూరు, పలమనేరు, కుప్పం మీదుగానే తరలిస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి విక్రయాలపై చిన్నపాటి సమాచారం వచ్చినా అప్రమత్తమయ్యే పోలీసులు చిత్తూరులో ఇద్దరు స్మగ్లర్లను పట్టుకోవడంలో ఏమరపాటుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
చిత్తూరు వన్‌టౌన్ నుంచి
గంజాయి స్మగ్లర్ పరారీ


