– నలుగురికి తీవ్ర గాయాలు
గంగాధర నెల్లూరు : మండలంలోని జైన్ కర్మగారం సమీపంలో శుక్రవారం కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. దీంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. పాలసముద్రం మండలం ఆముదాల గ్రామంలో జాతర జరిగింది. ఇందులో పాల్గొన్న మోహన్ నాయుడు కుటుంబ సభ్యులు కారులో బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. గంగాధర నెల్లూరు మండలం జైన్ కర్మగారం సమీపంలో కారు అదుపుతప్పి చింత చెట్టును ఢీకొంది. కారులోని నలుగురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యా యి. మోహన్ నాయుడు, ఆయన సతీమణి వాణికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు చిత్తూరు ఆస్పత్రికి తరలించారు. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


