● జిల్లాలో వంటగ్యాస్‌ కోసం వినియోగదారుల అవస్థలు ● బుక్‌ చేసి వారం రోజులైనా అందని సిలిండర్లు ● డీలర్ల నిర్లక్ష్యంపై మండిపడుతున్న ప్రజలు ● చిత్తూరు, కార్వేటినగరంలో ఎక్కువగా సమస్యలు | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో వంటగ్యాస్‌ కోసం వినియోగదారుల అవస్థలు ● బుక్‌ చేసి వారం రోజులైనా అందని సిలిండర్లు ● డీలర్ల నిర్లక్ష్యంపై మండిపడుతున్న ప్రజలు ● చిత్తూరు, కార్వేటినగరంలో ఎక్కువగా సమస్యలు

May 30 2026 12:17 AM | Updated on May 30 2026 12:17 AM

● జిల్లాలో వంటగ్యాస్‌ కోసం వినియోగదారుల అవస్థలు ● బుక్‌ చేసి వారం రోజులైనా అందని సిలిండర్లు ● డీలర్ల నిర్లక్ష్యంపై మండిపడుతున్న ప్రజలు ● చిత్తూరు, కార్వేటినగరంలో ఎక్కువగా సమస్యలు ● పదిరోజులు పడుతుందంటున్న అధికారులు ● సీడ్స్‌ సంస్థ నుంచి స్పష్టత లేక రైతుల్లో ఆందోళన

బండ కష్టాలు..!

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలో వంటగ్యాస్‌ సమస్య తీవ్రమైంది. సాధారణంగా గ్యాస్‌ బుక్‌ చేసిన రెండు రోజుల్లోనే సిలిండర్‌ ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం వారం రోజులైనా అందడం లేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిత్తూరు నగర పరిసరాలు, కార్వేటినగరం ప్రాంతాల్లో సమస్య మరింత ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. సిలిండర్‌ బుక్‌ చేసిన వెంటనే ‘డెలివరీలో ఉంది’ అనే సందేశాలు వస్తున్నప్పటికీ, ఇంటి వద్దకు మాత్రం చేరడం లేదని మహిళలు చెబుతున్నారు. డీలర్లకు పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించడం లేదని, కొన్నిసార్లు ఫోన్లు కూడా ఎత్తడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో చిన్నపిల్లలున్న కుటుంబాలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అదనపు ఛార్జీలు చెల్లిస్తేనే త్వరగా గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు స్వయంగా ఏజెన్సీల వద్దకు వెళ్లి గంటల తరబడి వేచి చూసినా సరైన సమాధానం లభించడం లేదని అంటున్నారు. ఇటీవల పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా కట్టెల పొయ్యిల వద్ద వంట చేయడం కష్టంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, గ్యాస్‌ ఏజెన్సీలు, అధికారులు వెంటనే స్పందించి గ్యాస్‌ సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని కోరుతున్నారు. జిల్లా అధికారులు డీలర్ల పనితీరుపై ప్రత్యేకంగా దృష్టి సారించి, వినియోగదారులకు సమయానికి గ్యాస్‌ సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వేరుశనగ విత్తనాలు

అందేదెన్నడో..?

కాణిపాకం: జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు ఖరీఫ్‌ సీజన్‌కు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు వేరుశనగ విత్తనాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు ఏప్రిల్‌ నెలలోనే 27 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కేటాయించినప్పటికీ సరఫరాపై స్పష్టత లేదు. దీంతో రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. జిల్లాలో వేరుశనగ ప్రధాన పంట కావడంతో రైతులు ముందుగానే విత్తనాల కోసం వ్యవసాయ కార్యాలయాలు, రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. విత్తనాల సరఫరాపై సీడ్స్‌ సంస్థ నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడంతో రైతుల్లో అనిశ్చితి నెలకొంది. అధికార వర్గాలు మాత్రం కాయలు రావడానికి ఇంకో పదిరోజుల సమయం పడుతుందని చెబుతుండడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ప్రారంభమైన తర్వాత విత్తనాలు అందితే సాగు ఆలస్యమై ఆ ప్రభావం దిగుబడులపై పడుతుందనే భయం వ్యక్తమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే పొలాలను దున్ని సిద్ధం చేసుకున్నప్పటికీ, విత్తనాలు లేక ముందడుగు వేయలేకపోతున్నారు. మార్కెట్‌లో ప్రైవేట్‌ విత్తనాల ధరలు అధికంగా ఉండడంతో ప్రభుత్వ సరఫరాపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి విత్తనాలను సరఫరా చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement