వి.కోటలో గాలీవాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

వి.కోటలో గాలీవాన బీభత్సం

May 30 2026 12:17 AM | Updated on May 30 2026 12:17 AM

● నెలకొరిగిన భారీ వృక్షాలు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ● దెబ్బతిన్న పలు పంటలు

వి.కోట: మండలంలో శుక్రవారం సాయంత్రం వడగండ్లతో కూడిన గాలీవాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు భారీ వృక్షాలు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లపై చెట్లు, ట్రాన్‌ఫార్మర్లు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపొయింది. స్థానికులు, విద్యుత్‌ అధికారులు, పంచాయతీ సిబ్బంది తక్షణం స్పందించి నెలకొరిగిన చెట్లను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతు పనులు చేపట్టారు. డీసీసీబీ పక్కన వీధిలోని ట్రాన్స్‌ఫార్మర్‌, ఎన్నో ఏళ్లనాటి భారీ వృక్షాలు నెలకొరిగాయి. కుప్పం– వి.కోట జాతీయ రహదారిలోని యునియన్‌ బ్యాంక్‌ ఎదురుగా ఉన్న పెద్ద చెట్టు కూలిపోయింది. చెట్టు పడడంతో కారు దెబ్బతినింది. గాలీవాన బీభత్సంతో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. వడగండ్ల వాన కురవడంతో టమాట, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement