పలమనేరు వాసికి ఏఎస్పీగా పదోన్నతి | - | Sakshi
Sakshi News home page

పలమనేరు వాసికి ఏఎస్పీగా పదోన్నతి

May 30 2026 12:17 AM | Updated on May 30 2026 12:17 AM

పలమనేరు: పలమనేరు పట్టణానికి చెందిన మహేష్‌ అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు. 2016 బ్యాచ్‌కు చెందిన మహేష్‌ ప్రస్తుతం హిందూపూర్‌ డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఇది వరకు కర్నూలు, నరసారావుపేట, గుంటూరులో డీఎస్పీగా పనిచేశారు. పలు కేసులను ఛేదించి ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందారు. ఈ క్రమంలో అడిషనల్‌ ఎస్పీగా పదోన్నతిపొంది హిందూపురంలోనే నియమితులయ్యారు. ఆయనను పట్టణానికి చెందిన పలువురు అధికారులు, పలమనేరు రచయితల సంఘం ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

నిరాశ పరుస్తున్న

మామిడి ధరలు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని మామిడి కాయల మార్కెట్‌లో శుక్రవారం ఉన్న మామిడి ధరలు రైతులను నిరాశపరిచాయి. తోతాపురి (టేబుల్‌ రకం) కిలో రూ.14 నుంచి రూ.15 వరకు పలుకుతోంది. పులేరా రూ.8 నుంచి రూ.15, బేనీషా రూ.20 నుంచి రూ.30, కాదర్‌ రూ.20 నుంచి రూ.30, కాలేపాడు రూ.20 నుంచి రూ.30, ఇమామ్‌ పసంద్‌ రూ.40 నుంచి రూ.80 వరకు అమ్ముడుతున్నట్టు ట్రేడర్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement