సారా రహిత జిల్లాయే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సారా రహిత జిల్లాయే లక్ష్యం

May 30 2026 12:11 AM | Updated on May 30 2026 12:11 AM

● సారా తయారీని విడిచిపెట్టిన 119 మందికి రుణాలు ● తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం ● కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ ఆదేశం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాను నాటుసారా రహితంగా మార్చడమే లక్ష్యమని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ తెలిపారు. ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సారా తయారీ, విక్రయాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని ఎకై ్సజ్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 42 గ్రామాల్లో నాటుసారాను పూర్తిగా నిర్మూలించడంతో పాటు, ఈ వ్యాపారాన్ని మానుకున్న 119 మంది సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగించేలా ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇందుకు బాధ్యత తీసుకోవాలని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌కు సూచించారు. ఎక్సైజ్‌ అధికారులు లబ్ధిదారులతో సమన్వయం చేసుకుంటూ వారికి ఉపాధి మార్గాలు దొరికేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా మద్యనిషేధ, అబ్కారీ అధికారి ఎస్‌.శ్రీనివాస్‌, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్లు ఎం.రవి, పురుషోత్తం, శిరీషదేవి, కె.సురేష్‌రెడ్డి, ఎ.నాగరాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement