వరసిద్ధి.. బుద్ధినివ్వు..! | - | Sakshi
Sakshi News home page

వరసిద్ధి.. బుద్ధినివ్వు..!

May 29 2026 2:43 AM | Updated on May 29 2026 2:43 AM

దళారులతో చేతులు కలిపిన కొందరు సిబ్బంది బ్రేక్‌ సమయంలోనూ ప్రత్యేక దర్శనాలు ప్రశ్నిస్తే దురుసుగా వ్యవహరిస్తున్న వైనం అధికారులకు ఫిర్యాదుల వెల్లువ

కాణిపాకం: కాణిపాకం ఆలయానికి రోజువారీగా 10 వేల మందికి పైగా భక్తులు వస్తుండగా.. సెల వు లు,పండుగల సమయంలో ఈ సంఖ్య 30 వేల వర కు చేరుతోంది. ఇంతటి ప్రముఖ క్షేత్రంలో పలువు రు అధికారులు, ఆలయ సిబ్బంది తీరు భక్తుల్లో అసహనానికి కారణమవుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని కొందరు దళారులు అవకాశంగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తెల్లచొక్కా, పంచెలు ధరించిన కొందరు వ్యక్తులు ఆలయ పరిసరాల్లో తిరుగుతూ ప్రత్యేక దర్శనాల పేరుతో భక్తుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. వారికి కొందరు ఆలయ సిబ్బంది సహకరిస్తున్నట్టు సమాచారం.

బ్రేక్‌ సమయాల్లోనూ దర్శనాలు

సాధారణ భక్తులు స్వామి వారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. దళారులు కొందరిని చెక్కడోర్‌, వీఐపీ మార్గాల ద్వారా నేరుగా ఆలయంలోకి పంపుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. బ్రేక్‌ దర్శనాల సమయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని భక్తులు వాపోతున్నారు. డబ్బులు ఇచ్చిన వారు, సిఫార్సు ఉన్న వారికి ప్రత్యే క దారి చూపుతున్నారని ఉభయదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన వారిపై సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు.

కాణిపాకం ఆలయంలో ఇష్టారాజ్యం

భక్తుల పట్ల అమర్యాద

కొంతమంది సిబ్బంది భక్తులతో అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నట్టు సమాచారం. ‘‘గణేశా’’ అని సంభోదించాలని ఆలయ అధికారులు ఆదేశిస్తు న్నా కొందరి తీరు మాత్రం మారడం లేదని భక్తు లు అంటున్నారు. దర్శనం కోసం దూరప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల యంలో దళారుల వ్యవస్థను పూర్తిగా అరికట్టాలని, ప్రత్యేక దర్శనాల పేరుతో జరుగుతున్న అక్రమాలను నిలువరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఫిర్యాదులపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆపదలు తొలగించే విఘ్నేశ్వరుడి సన్నిధిలోనే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దళారులతో చేతులు కలిపి బ్రేక్‌ సమయంలోనూ అడ్డదారుల్లో స్వామి దర్శనం చేయిస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. స్వామి దర్శనానికీ పలుకుబడి కావాలా అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement