సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు నగరంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ నాయుడుకు చేదు అనుభవం ఎదురైనట్టు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ వస్తున్నాయి. సంతపేటలో రెండు రోజుల క్రితం జరిగిన మినీ మహానాడు సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కొందరు పార్టీలో 40 ఏళ్లుగా ఉన్నామని చెప్పుకుంటున్నా రు. ఏదైనా పార్టీ కార్యక్రమం జరిగితే దాన్ని విజయవంతం చేయడంలో వాళ్ల పాత్ర ఏమిటనేది కూడా చూస్తున్నా.. అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా గురువారం పార్టీ కార్యాయలంలో జరిగిన టీడీపీ జెండా ఆవిష్కరణలో సీనియర్లంతా ముందుకు వచ్చి నిలబడడంతో ఎమ్మెల్యే వెను క్కు వెళ్లి నిలబడ్డారు. తమపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గానే సీనియర్లు ఇలా చేశారని, పార్టీ కా ర్యాలయంలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ప్రత్యక్షమయ్యాయి.


