పలమనేరు: పట్టణ సమీపంలోని పెద్ద చెరువులో దూకి మహి ళ ఆత్మహత్య చేసుకు న్న ఘటన గురువారం వెలుగుచూసింది. చెరువు లో మహిళ శవం తేలిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. విచారణలో ఆమె పట్టణంలోని పోలీస్ లైన్‌కు చెందిన లేట్ షేక్ బాబు భార్య షావర్(56)గా తేలింది. ఆమెకు ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్లుగా కుమార్తె ఇంట్లో ఉంటోంది. మూడు రోజుల నుంచి కనిపించకుండా పో యింది. గురువారం చెరువులో శవమై తేలింది. ఆర్థిక ఇబ్బందులతోపాటు ఇతరులకు డబ్బు ఇప్పించిందని తెలిసింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అను మానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పలమనేరు ఆస్పత్రికి రతలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.


