పర్మిట్ లేకుండానే తిరుగుతున్న కేఎస్‌ఆర్టీసీ బస్సులు రద్దీని బట్టి తిరుపతికి కావాల్సినప్పుడల్లా సర్వీసులు ఏపీ నుంచి పర్మిట్ లేకుండా వెళితే మన బస్సుల సీజ్ పట్టించుకోని ఆర్టీసీ, ఆర్టీవో అధికారులు
నమ్మదు కేఎస్‌ఆర్టీసీ..
‘‘మాది కర్ణాటక ఆర్టీసీ.. మాకు పర్మిట్ అవసరం లేదు. మా ఇష్టం వచ్చినట్టు వెళతాం. అడిగేదానికి మీరు ఎవరు..’’ అంటూ కేఎస్‌ఆర్టీసీ సిబ్బంది వ్యవహరిస్తున్నారు. పర్మిట్ లేకపోయినా యథేచ్ఛగా ఏపీలో బస్సులను తిప్పుతున్నారు. రద్దీని బట్టి తిరుపతి, చిత్తూరు, పలమనేరు, పుత్తూరు, తదితర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు. ఫలితంగా మన రాష్ట్రానికి రావాల్సిన రవాణా సుంకాలు, ప్రయాణికుల చార్టీలను పొరుగు రాష్ట్రం వారు తన్నుకుపోతున్నారు.
పలమనేరు: గత కొన్నేళ్లుగా కర్ణాటక ఆర్టీసీ బస్సులు ఎలాంటి పర్మిట్లు లేకుండా మన రాష్ట్రంలోని తిరుపతి, పలమనేరు, చిత్తూరు, పుత్తూరుకు నడుస్తున్నా యి. ముఖ్యంగా కోలారు, ముళబాగిళు, శ్రీనివాసపుర డిపోల నుంచి రిజర్వులో ఉన్న బస్సులను సైతం అంతర్రాష్ట్ర పర్మిట్లు లేకపోయినా అక్కడ తిరుపతికి వెళ్లే ప్రయాణికులు ఎక్కువ మంది ఉంటే స్పెషల్ బస్సులుగా పంపిస్తున్నారు. అనుమతులు లేకుండా నడుస్తున్న కర్ణాటక బస్సులను చూసి ఇక్కడి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు మనోవేదన చెందడం మినహా వాటిని అడ్డుకోలేని పరిస్థితి నెలకొంది. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదని వాపోతున్నారు.
స్పెషల్ బస్సులు సైతం ఇస్టారాజ్యం
కర్ణాటక రాష్ట్రంలోని పలు డిపోలకు చెందిన బస్సులను రద్దీని బట్టి తిరుపతి, బోయకొండ, తమిళనాడులోని మేళ్‌మరువత్తూర్, తిరువణ్ణామళై తదితర పుణ్య క్షేత్రాలకు అనుమతుల లేకుండానే నడుపుతున్నారు. మన రాష్ట్రానికి చెందిన ఏ బస్సు అయి నా చిన్నపాటి ఇబ్బంది ఉంటే దాన్ని సీజ్ చేస్తు న్నారు అక్కడి ట్రాన్స్‌ఫోర్ట్ అధికారులు.
రాత్రిళ్లు అడిగే దిక్కులేదు
పలమనేరు, చిత్తూరుకు పొరుగునే ఉన్న ముళబాగిళు, కోలార, చింతామణి, శ్రీనివాసపుర నుంచి రాత్రి సర్వీసులు పదికి పైగా బస్సులు పర్మిట్ లేకుండానే పలమనేరు మీదుగా నడుస్తున్నాయి. ఫలితంగా మనరాష్ట్ర రవాణాశాఖ కంటే వారికి భారీగా ఆదాయాలు లభిస్తోంది. ఈ విషయం తెలి సినా మన ట్రాన్స్‌పోర్ట్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పలుమార్లు అడ్డుకున్న ఏపీఎస్‌ఆర్టీసీ
ఇష్‌ట్రాాజ్యంగా కర్ణాటక నుంచి జిల్లాలోకి వస్తున్న బస్సులను పలమనేరు, చిత్తూరు డిపోలకు చెందిన ఆర్టీసీ అధికారులు పలుమార్లు అడ్డుకున్నారు. అయినా వారు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ వ్యవహారంలో కేఎస్‌ఆర్టీసీకి ఎవరి అండ ఉండో తెలియడం లేదని కొంతమంది ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. దీనిపై జిల్లా రవాణా శాఖ దృష్టి సారించాలని కోరుతున్నారు.
మన బస్సులకేమో రూల్స్ మీద రూల్స్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, మంగళం, తిరుమల, చిత్తూరు తదితర డిపోల నుంచి సుమా రు 125 బస్సులు కర్ణాటకలోని బెంగళూరుకు అంతర్రాష్ట్ర సర్వీసుల కింద నడుస్తున్నాయి. ఇవన్నీ ఎప్పటి నుంచో పక్కాగా పర్మిట్లు ఉన్న వాహనాలు. అదే విధంగా కర్ణాటకలోని పలు డిపోల నుంచి మన రాష్ట్రంలోకి పర్మిట్లున్న అక్కడి బస్సులు 70 వరకు ఉన్నాయి. పర్మిట్లు లేని బస్సులు పదుల సంఖ్యలో తిరుపతికి వచ్చి వెళుతూనే ఉన్నాయి. ఈ మార్గాల్లోని రవాణాశాఖ అధికారులు వాటి గురించి పట్టించుకోకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


