పుత్తూరు: మండలంలోని పుత్తూరు–చిత్తూరు ప్రధాన రహదారిపై చిన్నరాజుకుప్పుం సమీపంలో గురువారం ఉదయం స్థానిక టీడీపీ నాయకుడు టీవీఎస్ ప్రసాద్‌పై హత్యాయత్నం జరిగింది. ఎస్‌ఐ నాగేంద్రబాబు కథనం మేరకు.. పుత్తూరులో నివాసం ఉంటున్న ప్రసాద్ ప్రతి రోజూ స్వగ్రామమైన చిన్నరాజుకుప్పంలోని తన పొలం వద్దకు బైక్‌పై వెళ్లి వస్తుంటాడు. గురువారం కూడా వెళ్లి ఉదయం 7.30 గంటల సమయంలో పుత్తూరుకు తిరిగి వస్తుండగా చినరాజుకుప్పం గ్రామానికే చెందిన పి.రాజేంద్ర, పి.రవి, పి.సంతోష్, పి.నరేష్ ఆటోలో వచ్చి బైక్‌ను ఢీకొన్నారు. కింద పడిపోయిన ప్రసాద్‌పై కత్తులతో దాడి చేశారు. బాధితుడు కేకలు వేయడంతో సమీపంలోని వ్యక్తులు అక్కడికి రావడంతో నిందితులు పరారయ్యారు. గాయపడిన ప్రసాద్‌ను పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో ప్రసాద్ కుడి చేతిపై బలమైన రక్త గాయాలయ్యాయి. అతన్ని మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు. పాత కక్షలతోనే తన భర్తపై హత్యా యత్నానికి పాల్పడ్డారని బాధితుడి భార్య శ్యామలాదేవి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
క్రికెట్ ఫైనల్స్‌కు బంగారుపాళ్యం
తవణంపల్లె: మండలంలోని అరగొండ బాలుర హైస్కూల్లో ఈ నెల 9వ తేదీ నుంచి ఏబీకే క్రికెట్ టోర్నమెంట్ ఓపెన్‌టు ఆల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఓపెన్ టు ఆల్ క్రికెట్ టోర్నమెంట్‌కు పలు ప్రాంతాల నుంచి సుమారు 20 టీములు పాల్గొన్నట్లు క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ హరీష్ తెలిపారు. సెమీఫైనల్లో బంగారుపాళ్యం అనిల్–11 టీం, బెంగుళూరు టీం హోరాహోరీగా తలపడి గట్టి పోటీ ఇచ్చా రు. కానీ సెమీఫైనల్ పోటీల్లో బంగారుపాళ్యం అనిల్–11 టీం గెలుపొంది ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్స్ పోటీలు ఆదివారంతో ముగుస్తుందని వివరించారు. ఫైనల్స్‌లో గెలుపొందిన విన్నర్స్‌కు రూ.40 వేలతోపాటు కప్ అందజేస్తామన్నారు. ద్వితీయ బహుమతి రూ.20 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు చొప్పున అందజేస్తామని వివరించారు.


