తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలు కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్నవి 147 లాట్ల వస్త్రాలు, న్యూ ఆర్ట్ సిల్క్ శారీస్ జూన్ 4 నుంచి 6వ తేదీ వరకు టీటీడీ ఆన్‌లైన్‌లో ఇఏ ఐడీ నెంబరు 25918 టూ 25923 ద్వారా ఈ – వేలం వేయనున్నారు. ఈ మేరకు గురువారం టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ – కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన ఆసక్తి కలిగిన బిడ్డర్లు వస్త్రాల ఆన్‌లైన్ వేలంలో పాల్గొనటానికి అర్హులు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ (వేలం), ఏఈఓ టీటీడీ హరేకృష్ణమార్గ్ , తిరుపతి లేదా టీటీడీ వెబ్‌సైట్, లేదా 0877 – 2264429 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించాలని పేర్కొంది.
నాన్–కేడర్ ఎస్పీగా రాజశేఖర్ రాజు బాధ్యతలు
చిత్తూరు అర్బన్: చిత్తూ రు ఏఎస్పీగా పనిచేస్తూ నాన్–కేడర్ ఎస్పీగా ఉద్యోగోన్నతి పొందిన ఎస్‌ఆర్.రాజశేఖర్ రాజు గురువారం బాధ్యతలు తీసుకున్నా రు. ప్రభుత్వం ఆయనకు ఇటీవల ఉద్యోగో న్నతి కల్పిస్తూ మంగళగిరికి రిపోర్టు చేయాలని ఆదేశించింది. కాగా ఆయనను నాన్–కేడర్ ఎస్పీగా చిత్తూరులోనే నియమిస్తూ ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన ఇక్కడ బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఎస్పీ తుషార్ డూడీని మర్యాదపూర్వకంగా కలిశారు.


