– 8లో
బోధన అనుభవం లేని వారికి జేఎల్ ఉద్యోగోన్నలు? తక్షణమే జీవో రద్దు చేయాలి ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ
పక్వానికి వచ్చాకే మామిడి కోత
కాయలు పక్వానికి వచ్చాకే కోత కోయాలని జిల్లా ఇన్‌చార్జి హార్టికల్చర్ అధికారి శివకుమారి తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ విద్యాశాఖలో అనుభవం లేని సిబ్బందికి జూనియర్ లెక్చరర్లుగా ఉద్యోగోన్నతులు కల్పించడం దారుణమని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ అర్హతలు, ఏళ్ల తరబడి బోధన అనుభవం ఉన్న ఉపాధ్యాయులను పక్కనబెట్టి అనుభవం లేని సిబ్బందికి ఉద్యోగోన్నతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గతంలో పాఠశాల విద్యాశాఖలో అమలులో ఉన్న జీవో 302 ప్రకారం టీచర్లకు 40 శాతం జూనియర్ లెక్చరర్ ప్రమోషన్లు కల్పించేవారని చెప్పారు. ఇప్పుడు ఇచ్చిన జీవో 223 వల్ల టీచర్లకు జేఎల్ ఉద్యోగోన్నతులు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పారు. దీంతో ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖలో పనిచేస్తున్న టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు వంటి బోధనేతర సిబ్బందికి జేఎల్ ఉద్యోగోన్నతులు ఇవ్వడం సబబు కాదన్నారు. దీనివల్ల విద్యా ప్రమాణాలు క్షీణిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. తరగతి గది బోధనలో ప్రత్యక్ష అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇస్తేనే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వివాదాస్పద జీవో 223ను రద్దు చేసి, గతంలోలా 40 శాతాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.


