16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
– ఇద్దరి అరెస్టు
తిరుపతి అన్నమయ్య సర్కిల్: పీలేరు–కల్లూరు రోడ్డులో ఆదివారం సాయంత్రం వాహనంతోపాటు 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు అటవీశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ రేంజ్ ఆఫీసర్ సుబ్బరాయుడు తెలిపారు. తమ సిబ్బంది పట్రోలింగ్ చేస్తుండగా పాటూరు గ్రామం సమీపంలో ఇన్నోవా కారు అనుమానాస్పందంగా కనిపించిందన్నారు. సుమారు 40 కిలోమీటర్ల దూరం వెంబడించి దాన్ని పట్టుకున్నట్లు చెప్పారు. వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 483.4 కిలోల బరువున్న 16 దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. కారులో వున్న తిరువణ్ణామలైకి చెందిన ఎ.తిరుమల, జి.తిరుమలను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎఫ్‌ఎస్‌ఓ శశికుమార్, ఎఫ్‌బీఓ చంద్రబాబు, ఏబీఓ ప్రసాద్‌కుమార్, ఎఫ్‌ఎస్‌పీ బృందం పాల్గొన్నారు.


