శాస్త్రోక్తంగా ఆలయ మహాకుంభాభిషేకం | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా ఆలయ మహాకుంభాభిషేకం

Feb 23 2026 7:33 AM | Updated on Feb 23 2026 7:33 AM

శాస్త

శాస్త్రోక్తంగా ఆలయ మహాకుంభాభిషేకం

తవణంపల్లె: మండలంలోని అరగొండ సమీపంలో బహుదానది ఒడ్డున వెలసిన పురాతన శ్రీ స్వయంభువనేశ్వర కుమారస్వామి ఆలయంలో మూడు రోజులు మహాకుంభాభిషేక మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులకు సుమారు రూ.7 కోట్ల ఖర్చు చేశారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు వేద పండితులు అభిషేకాలు, పూజలు, హోమాలు, కలశస్థాపన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో చేపట్టారు. ఆదివారం ఉదయం గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, విశేషగ్రంథి, తురీయ కాల అవభృథ యాగశాల పూజ, సూర్యపూజ, చతుర్‌ాద్వర పూజ, భూత శుద్ధి, పంచగవ్య, యాగేశ, లాసన పూజ, విశేష ద్రవ్య హోమం, పూర్ణాహుతి చేప ట్టారు. యాత్రాదానం, కలశ ప్రదక్షిణం, విమాన, రాజగోపురం కుంభాభిషేకం, గణపత్యాది పరివార్య దేవతలకు కుంభాభిషేకం, శ్రీస్వయంభువనేశ్వర కుమారస్వామికి మహా కుంభాభిషేకం చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. అపోలో హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి కుటుంబ సభ్యులు పూర్ణచంద్రారెడ్డి, అపోలో హాస్పిటల్‌ అడ్వైజర్‌ సత్యనారాయణ రెడ్డి, సీఈవో నవీన్‌కుమార్‌ రెడ్డి, బాలరాజు, చంద్రశేఖర్‌రెడ్డి, నరోత్తమరెడ్డి, సుగుణాకర్‌ రెడ్డి, ఎంపీ దగ్గుముల్ల ప్రసాద్‌రావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆలయం మహా కుంభాషేకం పూజలు పాల్గొన్న ప్రముఖులు

మహా కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు

శాస్త్రోక్తంగా ఆలయ మహాకుంభాభిషేకం 1
1/1

శాస్త్రోక్తంగా ఆలయ మహాకుంభాభిషేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement