కట్ట మంచి చెరువు వైపు చూస్తే ఒట్టు..!
ఒరిగిపోయి.. తుప్పు పట్టిన కట్ట మంచి చెరువు గేట్లు
వాకింగ్ ట్రాక్ చుట్టూ కుంగిపోయిన రక్షణ వలయాలు
చెరువులో అందవిహీనంగా కనిపిస్తున్న పీవోపీ ప్రతిమలు
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో ప్రతిష్టాత్మక కట్టమంచి చెరువు రోజురోజుకూ ప్రాభవాన్ని కోల్పోతోంది. కూటమి నేతలు చెరువును అభివృద్ధి చేస్తున్నట్టు చెబుతూ భారీగా మట్టిని తరలించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. వినాయక చవితి వస్తోందంటే చెరువు ఇరిగేషన్ శాఖకు చెందిందనే విషయాన్ని మరిచిపోయి రూ.లక్షల్లో బిల్లులు ఇస్తున్న మునిసిపల్ కార్పొరేషన్ ఇప్పుడు మాకేమీ సంబంధంలేదన్నట్లు వ్యవహరిస్తోంది. చెరువులో మట్టిని తవ్వేయడంతో వాకింగ్ ట్రాక్‌కు రక్షణగా ఉన్న ప్రహరీ గోడ కుంగిపోయి వాకింగ్ చేసే వాళ్లకు ప్రమాదకరంగా మారినా నిమ్మకునీరెత్తినట్టు ఉంటున్నారు. చెరువు చుట్టూ మొక్కలు నాటి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని చెప్పిన నాయకుల మాటలు నీటి మూటలయ్యాయి. ఆహ్లాదకర వాతావరణం ఏమోగాని మురుగునీటితో ముక్కులు పగిలిపోతున్నాయని, మరి కట్ట్ఙమంచిశ్రీ చెరువు వైపు అధికారులు చూస్తే ఒట్టని స్థానికులు వాపోతున్నారు. చెరువు శిథిలమై అంద విహీనంగా మారిపోతుంటే నేతలు ఏం చెబుతారో..? ఇరిగేషన్ శాఖ ఏం చేస్తుందో..? మునిసిపల్ కార్పొరేషన్ ఏ నిధులు వెచ్చిస్తుందో..? అని ప్రజలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.
కట్ట మంచి చెరువు వైపు చూస్తే ఒట్టు..!
కట్ట మంచి చెరువు వైపు చూస్తే ఒట్టు..!
కట్ట మంచి చెరువు వైపు చూస్తే ఒట్టు..!


