ఉయ్యాలవాడకు ఘన నివాళి
చిత్తూరు అర్బన్: బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలిసారిగా తిరుబాటుచేసిన గొప్ప యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని పోలీసు అధికారులు తెలిపారు. చిత్తూరు నగరంలోని ఆర్ముడు రిజర్వు పోలీసు కార్యాలయంలో ఆదివారం ఏఆర్ ఏఏస్పీ దేవదాసు ఆధ్వర్యంలో నరసింహారెడ్డి వర్దంతిని జరుపుకున్నారు. ఆయన చిత్ర పటానికి పూలమాల లు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రాయలసీమ లో పుట్టిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రా ణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటీష్ పాలకులను ఎదిరించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ మహబూబ్ బాష, ఆర్‌ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
‘ప్రసాద్’ పరిధిలోకి
కాణిపాకాన్ని తీసుకొస్తా!
కాణిపాకం: ఆలయాలు, పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రసాద్ పథకం కిందకు కాణిపాకం ఆలయాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఆయన ఆదివా రం మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌తో కలిసి కాణి పాక వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. వారి వెంట ఎమ్మెల్యే మురళీమోహన్, చైర్మన్ మణినాయుడు, ఈఓ పెంచలకిషోర్ ఉన్నారు.
అనంతాళ్వార్ ఆదర్శప్రాయం
తిరుమల: శ్రీవైష్ణవ భక్తాగ్రేసరుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన అనంతాళ్వార్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని టీటీడీ జేఈఓ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. తిరుమలలోని అనంతాళ్వార్ తోట (పురశైవారితోట)లో ఆయన 972వ అవతార మహోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఈఓ మాట్లాడు తూ భక్తి అంటే ప్రార్థన మాత్రమే కాదని, భక్తి అంటే సేవ అని నిరూపించిన మహానుభా వుడు అనంతాళ్వార్ అని కీర్తించారు. అనంతాళ్వార్ వంశీకులు నాలాయిర దివ్య ప్రబంధ గోష్ఠిగానం నిర్వహించారు. అనంతరం తిరుమల పెద్ద జీయర్ స్వామి, తిరుమల చిన్న జీయర్ స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. అనంతాళ్వార్ వంశస్తులు వేంకట కృష్ణస్వామి, భరద్వాజస్వామి పాల్గొన్నారు.
రైతు నాయకుడు
జయచంద్రచౌదరి మృతి
తవణంపల్లె: రైతుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్న రాష్ట్ర రైతు సంఘాల సమైఖ్య ఆర్గనైజర్ జి.వి.జయచంద్ర చౌదరి ఆదివారం ఆయ న స్వగ్రామం జి.గొల్లపల్లెలో మృతి చెందాడు. ఆయన గతంలో రైతులకు ఉచిత విద్యుత్ కోసం ఎంతో కృషి చేశారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మృతికి పలువురు నాయకులు సంతాపం తెలిపారు.
శ్రీవారి దర్శనానికి
16 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 82,043 మంది స్వామి ని దర్శించుకున్నారు. 32,299 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.74 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 16 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
ఉయ్యాలవాడకు ఘన నివాళి


