వసూళ్లలో పలమనేరు టాప్‌ | - | Sakshi
Sakshi News home page

వసూళ్లలో పలమనేరు టాప్‌

Feb 22 2026 7:13 AM | Updated on Feb 22 2026 7:13 AM

వసూళ్

వసూళ్లలో పలమనేరు టాప్‌

● లక్ష్యం అధిగమించేనా? ● జిల్లాలో మార్కెట్‌ కమిటీలకు సెస్‌ టెన్షన్‌ ● వసూళ్లలో పలమనేరు మార్కెట్‌ టాప్‌ ● ఐదు కమిటీలు వసూళ్లల్లో వెనుకంజ ● మార్చికి టార్గెట్‌... అధికారుల్లో గుబులు

– 8లో

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్‌ కమిటీల

సెస్‌ (పన్ను) టెన్షన్‌ పట్టుకుంది.

కొన్ని మాత్రమే వసూళ్ల లక్ష్యానికి చేరువలో ఉన్నాయి. మిగిలినవి వెనుకంజలో ఉన్నాయి. మార్చి టార్గెట్‌తో అధికారుల్లో గుబులు పట్టుకుంది. జిల్లాలో ఉన్న వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు 2025–26 సంబంధించి రూ.8.96 కోట్లు వసూలు లక్ష్యం నిర్ధేశించింది. అయితే ఫిబ్రవరి 17 నాటికి రూ.7.16 కోట్లు వసూలు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు సంబంధించిన సెస్‌ వసూలుకు కేవలం ఒకనెల మాత్రమే గడువు ఉంది.

జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో సెస్‌ వసూలులో పలమనేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ముందంజలో ఉంది. పలమనేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ లక్ష్యం రూ 3.60 కోట్లు కాగా ఫిబ్రవరి 13 నాటికి రూ.3.88 కోట్లు వసూళ్లు చేసి ముందు వరుసలో నిలిచింది. బంగారుపాళ్యం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ లక్ష్యం రూ.85 లక్షలు కాగా రూ. 75.91 లక్షలు వసూలు చేసి ద్వితీయ స్థానంలో నిలిచింది. కుప్పం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ లక్ష్యం రూ. 85 లక్షలు కాగా రూ. 74.03 లక్షలు వసూలు చేసి లక్ష్యానికి చేరువలో ఉంది. అయితే మిగిలిన కమిటీలో వసూళ్లు నత్త నడకన సాగుతున్నాయి.

సెస్‌..బుస్‌ !

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : జిల్లాలో ఎనిమిది వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 27 చెక్‌ పోస్టులు ఉన్నాయి. వ్యవసాయ మార్కెట్‌ల ద్వారా మామిడి, టమాట, వరి, కొబ్బరి ఇతర పంటల క్రయ విక్రయాలు చేస్తుంటాయి. వీటి పరిధిలో ఎక్కువ మంది ట్రేడర్లు ముందు సెస్‌ చెల్లించి ఎగుమతులు చేస్తుంటారు. మరికొంత మంది చిన్న స్థాయి వ్యాపారులు చెక్‌ పోస్టుల వద్ద చెల్లించి ఎగుమతులు చేస్తుంటారు. ఈక్రమంలో ఉత్పత్తులకు ఒకశాతం సెస్‌ వసూళ్లు చేస్తున్నారు. ఈ వసూళ్లల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పలమనేరు మార్కెట్‌ కమిటీ లక్ష్యాన్ని అధిగమించింది. రెండు కమిటీలు లక్ష్యానికి చేరువలో ఉన్నాయి. ఐదు కమిటీలు నత్త నడకన నడుస్తున్నాయి. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా వసూళ్ల లక్ష్యం రూ.8.96 కోట్లు ఉంటే...ఇప్పటికీ రూ.7.16 కోట్లు వసూళ్లు చేసింది.

జిల్లాలో సెస్‌ వసూళ్ల వివరాలు ఇలా..

సమాజ సేవకు తోడ్పడాలి

అమ్మభాష కోసం ఉద్యమం

– అపోలో వర్సిటీ స్నాతకోత్సవం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : విద్యా వైభవం, అకడెమిక్‌ గౌరవం, పట్టభద్రుల ఆనందోత్సాహాల మధ్య అపోలో వర్సిటీ ద్వితీయ స్నాతకోత్సవం శనివారం సాయంత్రం చిత్తూరు మురకంబట్టులోని అపోలో నాలెడ్జ్‌ సిటీ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌ డా. ప్రతాప్‌ సి. రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఐఐటీ తిరుపతి డైరెక్టర్‌ డా. కె.ఎన్‌. సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డా. ప్రతాప్‌ సి. రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు సంపాదించిన జ్ఞానాన్ని సమాజ సేవకు వినియోగించుకోవాలని సూచించారు. 43 సంవత్సరాల క్రితం ప్రాథమిక ఆరోగ్య సేవలతో ప్రారంభమైన అపోలో సంస్థ ఈ రోజు సేవలు, సాంకేతికత, వైద్య ఫలితాల్లో ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలిచిందన్నారు. చిత్తూరులోని అపోలో వర్సిటీ మూడు సంవత్సరాల్లోనే విశేష పురోగతి సాధించి, కొత్త కోర్సులు ప్రారంభించి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ డా. ప్రీతా రెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా. సునీత రెడ్డి, సిటీ సీఈఓ శివరామకష్ణన్‌ వెంకటేశ్వరన్‌, ప్రో–చాన్సలర్‌ డా. రవి రాజు టి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం. పోతరాజు, డీన్లు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

28న ధర్మకర్త మండలి సమావేశం

కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఈనెల 28న ధర్మకర్త మండలి సమావేశం నిర్వహించనున్నట్లు ఈఓ పెంచల కిషోర్‌ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. దేవస్థానం పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు అందించే సౌకర్యాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నామన్నారు. సంబంధిత అధికారులు, మండలి సభ్యులు హాజరు కావాలని పేర్కొన్నారు.

కాణిపాకంలో

స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర

కాణిపాకం : వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ‘స్వర్ణాంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం శనివారం నిర్వహించారు. దేవస్థానం అతిథి గృహంలో ఈవో పెంచల కిషోర్‌, చైర్మన్‌ మణి నాయుడు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేపట్టారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి ఆలయ మాడ వీధులు, బస్టాండ్‌ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించాలని అధికారులకు సూ చించారు. భక్తుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఈఓలు ధనంజయ, ఎస్‌వీ కృష్ణారెడ్డి, హరి మాధవరెడ్డి, సూపరింటెండెంట్లు రంగస్వామి తదితరులు, శానిటరీ , దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

ఆదర్శ పాఠశాల

ప్రవేశాలకు దరఖాస్తులు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పరీక్ష రుసుం ఓసీ, బీసీ కులాల వారికి రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.125 చెల్లించాలన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు మార్చి 31 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆరో తరగతి అడ్మిషన్లకు ఓసీ, బీసీలకు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 30 మార్కులు రావాల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు సంబంధించి ఆయా ఆదర్శ పాఠశాలలు, ఎంఈవోలను సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వ్యవసాయ సెస్‌ లక్ష్యం వసూళ్లు

మార్కెట్‌ పేరు (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో..) చిత్తూరు 215 123.52 పలమనేరు 360 388.24 బంగారుపాళ్యం 85 75.91

నగరి 80 20.78

కుప్పం 85 74.03

పెనుమూరు 40 14.84

రొంపిచెర్ల 16 10.48

ఎస్‌ఆర్‌పురం 15 8.95

వెనుకంజలో ఇవీ

జిల్లా వ్యాప్తంగా పలమనేరు లక్ష్యాన్ని అధిగమించింది. కుప్పం, బంగారుపాళ్యం లక్ష్యానికి దగ్గరలో ఉంది. నగరి, చిత్తూరు, పెనుమూరు, రొంపిచెర్ల, ఎస్‌ఆర్‌పురం కమిటీలు వసూళ్లల్లో వెనకబడి ఉన్నాయి. మార్చికి నిర్ధేశించిన లక్ష్యాన్ని వీటిలో కొన్ని అధిగమించేలా లేవు. ఆ రకంగా అధికారులు పట్టుబడుతారా లేదా అనేది సందిగ్ధంలో పడింది. అయితే అధికారులు మాత్రం లక్ష్యాన్ని కచ్చితంగా అందిపుచ్చుకుంటామని చెబుతున్నారు.

వసూళ్లలో పలమనేరు టాప్‌ 
1
1/2

వసూళ్లలో పలమనేరు టాప్‌

వసూళ్లలో పలమనేరు టాప్‌ 
2
2/2

వసూళ్లలో పలమనేరు టాప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement