మామిడి రైతులకు 50 శాతం రాయితీతో కవర్లు | - | Sakshi
Sakshi News home page

మామిడి రైతులకు 50 శాతం రాయితీతో కవర్లు

Feb 22 2026 7:13 AM | Updated on Feb 22 2026 7:13 AM

మామిడి రైతులకు  50 శాతం రాయితీతో కవర్లు

మామిడి రైతులకు 50 శాతం రాయితీతో కవర్లు

తవణంపల్లె : మామిడి రైతులకు 50 శాతం రాయితీతో మామిడి కవర్లు అందజేస్తామని ఉద్యానశాఖ జిల్లా అధికారి రామాంజనేయులు తెలిపారు. శనివారం మండలంలోని వెంగంపల్లెలో మామిడి రైతులకు పూత, పిందె దశలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సంద ర్భంగా జిల్లా ఉద్యానశాఖ అధికారి రామాంజనేయు లు మాట్లాడుతూ.. మామిడికి సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడి సాధించాలన్నారు. ఉద్యానశాఖ అధికారి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. మామిడికి పూత, పిందె దశలో ఆరుతడులు వేయాలన్నారు. డాట్‌ సెంటర్‌ ప్రధాన శాస్త్రవేత్త, జిల్లా కోఆర్డినేటర్‌ రామకృష్ణారావు మాట్లాడుతూ.. మామిడిలో తేనే మంచు పురుగు నివారణకు అధికారులు సూచించిన మందులు పిచికారీ చేయాలని సూచించారు. బంగారుపాళ్యం ఉద్యానశాఖ అధికారి సాగరిక, ఆర్‌ఎస్‌కె సిబ్బంది అనంత్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement