హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు
పెద్దపంజాణి : హత్యాయత్నం కేసులో నిందితున్ని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ మారప్ప తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని రాజుపల్లి పంచాయతీ కమ్మినాయునిపల్లికి చెందిన విష్ణు అదే గ్రామానికి చెందిన మునస్వామిపై 2025 జనవరి 9వ తేదీ కత్తితో నరికి హత్య చేయడానికి యత్నించాడు. తర్వాత గ్రామం నుంచి పారిపోయాడు. బాధితుడు మునస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రాజుపల్లి చెక్‌పోస్టు వద్ద బుధవారం విష్ణును అరెస్టు చేసి రిమాండు నిమిత్తం కోర్టుకు తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


