విగ్రహం..
చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయడం లేదని మండిపడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో శ్రీకారం చుట్టిన మెడికల్ కాలేజీలను గాలికి వదిలేశారని ఆవేదన చెందుతున్నారు. ఇష్టారాజ్యంగా నిధులు దుర్వినియోగం చేస్తున్నారని రగిలిపోతున్నారు. గొప్పల కోసం రూ.కోట్లు వెచ్చించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూలిగే నక్కపై తాటి పండులా సొంత ప్రయోజనాల కోసం ఎన్‌టీఆర్ ప్రతిమ పేరుతో ఖజానాపై అదనపు భారం వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బతికి ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిచి.. ఇప్పుడేమో రూ.వేల కోట్లతో విగ్రహం పెడతామంటూ స్వార్థ రాజకీయాలకు తెరతీశారంటూ విమర్శిస్తున్నారు. ప్రజాధనంతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా బాబు సర్కారు తీరు మార్చుకోకుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. – తిరుపతి సిటీ
టీడీపీ ఫండ్‌తో పెట్టుకోండి
ఎన్టీఆర్ విగ్రహం, స్మారక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయడం ప్రజాధనాన్ని వృఽథా చేయడమే. ఆ మొత్తాన్ని ప్రభు త్వ మెడికల్ కాలేజీలకే కేటాయిస్తే పేదవిద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. టీడీపీ ఫండ్‌తో పెట్టుకుంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు.
– చైతన్య, జిల్లా ప్రధాన కార్యదర్శి,
విద్యుత్ వినియోగదారుల సంఘం, చిత్తూరు
పోరు బాట తప్పదు
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు ప్రజల సొమ్మును వినియోగిస్తే బాబు సర్కారుపై పోరుబాట తప్పదు. విగ్రహ ప్రతిష్ట కేవలం టీడీపీకి చెందిన విషయం. వారి పార్టీ నిధులు, ఎన్‌టీఆర్ వారసుల డబ్బులతో విగ్రహం ఏర్పాటు చేసుకోవాలి. అంతే కానీ, ప్రజలు పన్నుల రూపేణా కట్టిన సొమ్మును దుర్వినియోగం చేస్తే సహించం. ఒక్క విగ్రహానికి రూ.వేల కోట్లు ఖర్చు చేయాలనుకోవడం దుర్మార్గం. ఆ నగదును ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు వాడితే ఉపయోకరం. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తే మంచిది. – జ్యోతి, సీఐటీయూ, జిల్లా కార్యదర్శి, పూతలపట్టు
ఇది ఎన్నికల స్టంటే
రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. కానీ అవన్నీ వదిలేసి రూ.1700 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇది కేవలం ఎన్నికల స్టంటుగానే భావిస్తున్నాం. మేము విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు. అన్ని రూ.వేల కోట్లతో నిర్మాణ దశలో ఆగిపోయిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయవచ్చు.
– నాగరాజు, జిల్లా కార్యదర్శి, సీపీఐ
విగ్రహం..
విగ్రహం..
విగ్రహం..


