నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌డే | - | Sakshi
Sakshi News home page

నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌డే

Jan 19 2026 4:21 AM | Updated on Jan 19 2026 4:21 AM

నేడు

నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌డే

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలోని వన్‌టౌన్‌ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్‌) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్‌ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడ చ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు.

మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కురుక్షేత్రలో నిరసన

చిత్తూరు అర్బన్‌: దేశ వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు భవిష్యత్తులో డీఏలు అమలు చేయకుండా కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హర్యాన రాష్ట్రంలోని కురుక్షేత్రలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు కె.నాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 22, 23 తేదీల్లో కురుక్షేత్రలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న పెన్షనర్లతో కలిసి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తామన్నారు. జిల్లాలోని పెన్షనర్లంతా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని, వివరాలకు ఫోన్‌–94419 81936ను సంప్రదించాలని కోరారు.

చెరువులో పడి మహిళ మృతి

కుప్పంరూరల్‌: ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి చెందిన సంఘటన పట్టణంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథ నం మేరకు, కుప్పం పట్టణం ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన చలపతి భార్య ప్రభావతి (58) సమీపంలోని చీలేపల్లి చెరువులో దుస్తులు ఉతికేందుకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడడంతో మృతి చెందింది. దీన్ని గమనించిన స్థానికు లు కుప్పం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రభా వతి కుమారుడు విజయ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కుప్పం పోలీసులు తెలిపారు.

శ్రీవారి దర్శనానికి

24 గంటలు

తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా పెరిగింది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూౖ లెన్‌ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 83,576 మంది స్వామివారిని దర్శించుకోగా.. 31,173 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.07 కోట్లు సమ ర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కె ట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంట ల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నా రు. ఇది లా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోమని స్పష్టంచేసింది.

వైభవంగా ముగిసిన

‘విరాసత్‌’

ఏర్పేడు : మండలంలోని జంగాలపల్లె సమీపంలో ఉన్న తిరుపతి ఐసర్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన విరాసత్‌–2026 సాంస్కృతిక ఉత్సవాలు ఆదివారంతో వైభవంగా ముగిశాయి. వేడుకల్లో వివిధ ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులను ఐసర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ శంతాను భట్టాచార్య ఘనంగా సత్కరించి జ్ఞా పికలను అందజేశారు. స్పిక్‌ మికాయ్‌ అనే సంస్థ సహకారంతో చేపట్టిన ఉత్సవాల్లో ఆదివా రం భారతీయ శాసీ్త్రయ నృత్య కళాకారులు పద్మశ్రీ విద్వాన్‌ ఘనకాంత బోరా, డాక్టర్‌ అన్వేష మహంతా నృత్య ప్రదర్శనలు వీక్షకులను అబ్బురపరిచాయి. కార్యక్రమంలో ఐసర్‌ రిజిస్ట్రార్‌ ఇంద్రప్రీత్‌ సింగ్‌ కోహ్లీ పాల్గొన్నారు.

25న రథసప్తమి

– శ్రీవారికి ఏడు వాహన సేవలు

తిరుమల: తిరుమలలో ఈ నెల 25వ తేదీన రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారు ఏడు వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో విహరించనున్నారు. ఈ మేరకు భారీ సంఖ్యలో తిరుమలకు తరలివచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. అలాగే రథసప్తమి రోజున కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. సుప్రబాతం, తోమాల, అర్చనను ఏకాంతంలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌డే 
1
1/1

నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌డే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement