నకిలీ వెబ్‌సైట్లతో జాగ్రత్త
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సమగ్ర శిక్ష శాఖ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే నకిలీ వెబ్‌సైట్లను నమ్మకూడద ని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలి పారు. ఈ మేరకు ఆదివారం కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. సమగ్రశిక్ష శాఖలో భర్తీ చేస్తున్న పోస్టుల పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ల ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నారని సమాచారం ఉందన్నారు. www.sarvashikshaabhiyan. com/jobs.php అనేది ప్రభుత్వ వెబ్‌సైట్ కాదన్నారు. ఆ వెబ్‌సైట్‌ను ప్రజలెవ్వరూ నమ్మకూడదని తెలిపారు. నిరుద్యోగులు నకిలీ వెబ్‌సైట్‌లను చూసి మోస పోకూడదన్నారు. అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సమాచారం ఎప్పుడూ అధికారిక వెబ్‌సైట్‌లోనే వస్తుందన్నారు. ప్రజలు దరఖాస్తు చేసే ముందు తప్పనిసరిగా సమాచారం ధృవీకరించుకోవాలని కలెక్టర్ తెలిపారు.


