టిప్పర్ ఇసుక రూ.లక్షల్లో...
వావిల్ తోటలో లభ్యమయ్యే ఇసుక టిప్పర్‌కు తమిళనాడు, కర్ణాటకలో రూ.1.20 లక్షలు పలుకుతోంది. ఇలా రోజుకు ఆరు టిప్పర్లు తరలిస్తే రూ.7.2 లక్షల (సుమారు) మేరకు ఆదాయం వస్తోంది. ఇలా నెలకు సుమారు రూ.2.16కోట్ల మేర ఆర్జిస్తున్నారు. వావిల్‌తోటలో ఆ నేత పేరు చెబితేనే ఇసుక మాఫియా లీడరంటూ ఆడిపోసుకుంటారు. కొందరు ఆ నేత పేరును గోప్యంగా ఉంచినా.. 90శాతం జనం అక్రమ ఇసుక వ్యాపారంపై తిరగబడాలని చూస్తున్నారు. ఆ నేతకు మరో నేత తోడై, అక్రమ ఇసుక వ్యాపారాన్ని నడిపిస్తున్నారన్న చర్చ మొదలైంది. వీరికి జతగా ఇంకో నేత ఇసుకను లారీకెక్కిస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు కలిసి తోటలోని వంకను ఖాళీ చేయించి కోట్లు దండుకుంటున్నారు.


