
యూరియాకు అగచాట్లు
కాణిపాకం : జిల్లాలో యూరియా కొరత రైతులకు క న్నీళ్లు తెప్పిస్తున్నాయి. యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద బారు లు తీరి పడిగాపులు కాస్తున్నారు. ఇదే అదనుగా ఎరువుల వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కొరతను సాకుచూపి అందిన కాడికి దండుకుంటున్నారు. అయినా వ్యవసాయ శాఖ అధికారులు చూసీచూడన ట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో వరితో పాటు ఇతర పంటలు వేల హెక్టార్లల్లో సాగువుతోంది. వరి నాట్లు అ ధికంగా పడుతున్నాయి. దీనికి తోడు కూరగాయలు, వివిధ రకాల పండ్లతోటలు విస్తారంగా సాగు చేస్తున్నారు. ఇందుకు కావాల్సిన యూరియాను ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు. అరకొరగా పంపిణీ చేస్తోంది. నెల రోజులుగా చూస్తే రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 57 టన్నులు మిగులు ఉంది. రైతు భరోసా కేంద్రాలు 502 ఉండగా అన్నింటిలో యూరియా లేదు. సహకార సంఘాలు 5, ప్రైవేటు షాపుల్లో 200కు గాను 50 షాపుల్లో మాత్రమే యూరియా నిల్వలున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అరకొర యూరియా కోసం జిల్లాలోని రైతులు కుస్తీ పడుతున్నారు.
జిల్లాలో వేధిస్తున్న కొరత
సాగు విసీర్ణానికి తగ్గట్టు సరఫరా కాని వైనం
ప్రైవేటు షాపులకు కేటాయింపులు
రైతు భరోసా కేంద్రాలకు ఇవ్వని వైనం