
గుడిపాల: పొలాల్లో సంచరిస్తున్న ఏనుగులు
గుడిపాల: గుడిపాల మండలానికి గురువారం రాత్రి ఏనుగుల గుంపు చేరింది. చిత్తపార అటవీప్రాంతం నుంచి వెప్పాలమాను గ్రామ సమీపంలోని అటవీప్రాంతానికి ఏనుగులు చేరుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రవిశంకర్ అనే రైతుకు చెందిన పాడి ఆవును గాయపరిచాయి. అలాగే కొంత దూరంలోని టమాట పంటను తొక్కి నాశనం చేశాయి. అక్కడే పొలానికి అడ్డుగా ఉన్న ఫెన్సింగ్‌ను ధ్వంసం చేశాయి. ప్రస్తుతం పల్లూరు గ్రామం వైపు ఏనుగులు సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో వరిపంటను ధ్వంసం చేస్తుండగా అక్కడి రైతులు టపాకాయలు పేల్చి ఏనుగుల గుంపును అటవీప్రాంతంలోకి తరిమారు. ఆపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

పెన్సింగ్‌ను ధ్వసం చేసిన ఏనుగుల గుంపు