● ఎన్నికల నియమావళికి విరుద్ధంగా జాతర విషయంపై ప్రకటన చేసిన సీకే ● 24 గంటల్లోపు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాలు ● నోటీసు జారీచేసిన చిత్తూరు అసెంబ్లీ ఏఆర్‌ఓ చిన్నయ్య | Sakshi
Sakshi News home page

● ఎన్నికల నియమావళికి విరుద్ధంగా జాతర విషయంపై ప్రకటన చేసిన సీకే ● 24 గంటల్లోపు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాలు ● నోటీసు జారీచేసిన చిత్తూరు అసెంబ్లీ ఏఆర్‌ఓ చిన్నయ్య

Published Fri, Apr 12 2024 1:50 AM

మాజీ ఎంపీపీ రాజేంద్రన్‌తో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి   - Sakshi

పార్టీ గెలుపునకు కృషి చేయండి

పలమనేరు: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం కృషి చేయాలని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలమనేరు మాజీ ఎంపీపీ రాజేంద్రన్‌కు సూచించారు. ఈ మేరకు మంత్రి గురువారం స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడతో కలసి పట్టణంలోని రాజేంద్రన్‌ ఇంటికి వెళ్లి మాట్లాడారు. ఈ ఎన్నికలు వైఎస్సార్‌సీపీకి చాలా కీలకమని, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగాలంటే తప్పకుండా వైఎస్సార్‌సీపీ పాలన రావాల్సిందేనన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రన్‌ మాట్లాడుతూ పట్టణంలో వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం శక్తివంచనల లేకుండా కృషి చేస్తామని మంత్రికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పెద్దపంజాణి నాయకులు సుహేబ్‌ పాల్గొన్నారు.

జెడ్పీ చైర్మన్‌ ఇంటి పెరట్లో ‘ఆపిల్‌’

వి.కోట: ఎక్కడో అతిచలి ప్రాంతాల్లో పండే ఆిపిల్‌ వి.కోట మండలంలోని పి.కొత్తూరు గ్రామం జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు పెరట్లో గురువారం దర్శనమిచ్చింది. ఆ ఆపిల్‌ని జెడ్పీ చైర్మన్‌ దంపతులు పట్టణంలో వెలసిన శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి సమర్పించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ ఆ మొక్కను ఏడాది కిందట హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాసపూర్‌ జిల్లాలో నివసించే శ్రీ హరిమాన్‌ శర్మ దగ్గర కొన్నట్లు చెప్పారు. సాధారణంగా చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాసే ఆపిల్‌ పండు 35–40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వి.కోట మండలంలో కాయడం ఆశ్చర్యంగా అనిపించిందన్నారు.

సీకే బాబుకు నోటీసులు జారీ

చిత్తూరు కలెక్టరేట్‌ : ఎన్నికల నియమావళికి విరుద్ధంగా చిత్తూరు జాతర విషయంపై సామాజిక మాధ్యమాల్లో పత్రికా సమావేశం ఉంటుందని వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు గురువారం రాత్రి చిత్తూరు అసెంబ్లీ అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి చిన్నయ్య నోటీసులు జారీచేశారు. వివరాల మేరకు.. మే 14, 15 తేదీల్లో నిర్వహించే చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర వేడుకలపై ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు నగరంలోని పొన్నియమ్మన్‌ దేవస్థానంలో విలేకరుల సమావేశం ఉంటుందని సీకే బాబు సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు మార్చి 16వ తేదీ నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉందన్నారు. ఈ సమయంలో సమావేశాలకు జిల్లా ఎన్నికల అధికారి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా ఎలాంటి అనుమతి లేకుండా జాతర విషయంపై సమావేశం ఉంటుందని సామాజిక మాధ్యమాల్లో ప్రకటన ఇచ్చారని పేర్కొన్నారు. ఇందుకు గాను జాతర నిర్వాహకులు సీకే బాబుకు నోటీసు జారీచేయడం జరిగిందన్నారు. 24 గంటల్లోపు తప్పనిసరిగా సంజాయిషీ ఇవ్వాలని ఏఆర్‌ఓ ఆ నోటీసులో పేర్కొన్నారు.

యువకుడు ఆత్యహత్య

పుంగనూరు: మండలంలోని రాంపల్లెకు చెందిన రామయ్య కుమారుడు కుమార్‌ (33) కడుపునొప్పి తాళలేక ఇంట్లో ఉరివేసుకుని గురువారం మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. కుమార్‌ క్వారీలో పని చేస్తుంటాడు. ఇలా ఉండగా గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న కుమార్‌ ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని మృతి చెందాడు. దీన్ని గమనించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులతో కలిసి కాపాడే ప్రయత్నం చేసి, కుమార్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శవాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతి చెందిన కుమార్‌
1/1

మృతి చెందిన కుమార్‌

Advertisement
 
Advertisement