అసత్య కథనాలపై ఆగ్రహం

సదుంలో ఈనాడు ప్రతులను దహనం చేస్తున్న పెద్దిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు  - Sakshi

సదుం: ఈనాడు దినపత్రిక పాఠకుల విశ్వనీయత కోల్పోయిందని, విలువలను పూర్తిగా వదిలేసిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంపై తప్పుడు కథనాల ప్రచురించినందుకు నిరసనగా శుక్రవారం సదుంలో ఈనాడు ప్రతులను దహనం చేశారు. చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా ఎల్లో మీడియా పని చేయడం దారుణమన్నారు. ఈనాడు, ఏబీఎన్‌, టీవీ5లను ప్రజలు నమ్మడం మానేశారని చెప్పారు. ఇప్పటికై నా వాస్తవాలను ప్రచురించకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఎవరెన్న ప్రయత్నాలు చేసిన అంపశయ్యపై ఉన్న టీడీపీని బతికించలేరని స్పష్టం చేశారు. ఎంపీపీ ఎల్లప్ప, సచివాలయాల మండల కన్వీనర్‌ ప్రకాష్‌రెడ్డి, సర్పంచ్‌ ఉషారాణి, కో–ఆప్షన్‌ సభ్యుడు ఇమ్రాన్‌, మాజీ ఎంపీపీ వెంకటస్వామి, సయ్యద్‌బాషా, పుట్రాజు, హనుమంతరెడ్డి, ఇర్పాన్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.

శ్రీరంగరాజపురం: తప్పుడు కథనాలను ప్రచురించడంలో రామోజీరావు దిట్టని జెడ్పీటీసీ సభ్యుడు రమణప్రసాద్‌ రెడ్డి ఆరోపించారు. ఈనాడు దినపత్రిక ప్రతులను శుక్రవారం దహనం చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు మాట్లాడుతూ పట్టాభిని కొట్టారంటూ పాత ఫొటోలతో తప్పుడు కథనం ప్రచురించి ప్రజలను ,చట్టాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాయించినందుకు రామోజీరావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు జనార్ధన్‌, కుప్పయ్య, మణి, బాబు, చిన్నబ్బ, బాలకృష్ణ యాదవ్‌, రామచంద్రయాదవ్‌, రామకృష్ణ పాల్గొన్నారు.

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top