జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లాభం రూ. 13 కోట్లు | Zee Entertainment Posts consolidated net profit of Rs 13. 35 cr in Q4 results | Sakshi
Sakshi News home page

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లాభం రూ. 13 కోట్లు

May 18 2024 6:10 AM | Updated on May 18 2024 6:10 AM

Zee Entertainment Posts consolidated net profit of Rs 13. 35 cr in Q4 results

న్యూఢిల్లీ: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (జీల్‌) నాలుగో త్రైమాసిక నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 13.35 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ4లో రూ. 196 కోట్ల నష్టం నమోదైంది. సమీక్షాకాలంలో మొత్తం ఆదాయం రూ. 2,126 కోట్ల నుంచి రూ. 2,185 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ. 2,083 కోట్ల నుంచి రూ. 2,044 కోట్లకు తగ్గాయి. షేరు ఒక్కింటికి రూ. 1 చొప్పున కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. 

మరోవైపు, పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం రూ. 48 కోట్ల నుంచి రూ. 141 కోట్లకు పెరగ్గా, ఆదాయం రూ. 8,168 కోట్ల నుంచి రూ. 8,766 కోట్లకు చేరింది. సబ్ర్‌స్కిప్షన్‌ ఆదాయం, ఇతరత్రా సేల్స్, సర్వీస్‌ల ద్వారా ఆదాయం వృద్ధి చెందినట్లు జీల్‌ వెల్లడించింది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వన్‌–టైమ్‌ ప్రాతిపదికన కొన్ని కేటాయింపులు జరపాల్సి రావచ్చని, దీంతో మార్జిన్లపై కొంత ప్రభావం పడొచ్చని పేర్కొంది. అయితే, రెండో త్రైమాసికం నుంచి మార్జిన్‌ క్రమంగా మెరుగుపడగలదని వివరించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement