ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవడానికి కావలసిన కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం పేయూతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.

ప్రస్తుతం వాట్సాప్ పరిచయం చేసిన ఈ మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు దశలవారీగా అందుబాటులోకి వస్తుంది. ఇకపై పేటీఎం లేదా గూగుల్ పే వంటి ఇతర పేమెంట్ యాప్‌లతో పనిలేకుండానే.. నేరుగా వాట్సాప్ ద్వారానే రీఛార్జ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ హోమ్ స్క్రీన్‌పై ప్రత్యేకంగా రూపాయి ఐకాన్‌ను జోడించింది. రీఛార్జ్ చేయడానికి ఆ ఐకాన్‌పై ట్యాప్ చేయాలి. మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆప్షన్‌ను ఎంచుకుని, మీరు రీఛార్జ్ చేయాలనుకుంటున్న నెంబర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అది పూర్తయ్యాక, UPI, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వంటి మీకు నచ్చిన చెల్లింపు పద్ధతిని ఎంచుకుని.. చెల్లింపును పూర్తి చేయాలి.


