వారికోసం యస్‌ బ్యాంక్‌ ప్రైవేట్‌ డెబిట్‌ కార్డు, బెనిఫిట్స్‌ ఏంటి? 

Yes Bank launches premium debit card for for HNIs - Sakshi

ముంబై: అత్యంత సంపన్న కస్టమర్ల (హెచ్‌ఎన్‌ఐ) కోసం మాస్టర్‌కార్డ్‌ భాగస్వామ్యంతో యస్‌ బ్యాంక్‌ కొత్తగా ప్రైవేట్‌ డెబిట్‌ కార్డును ఆవిష్కరించింది. సంపన్న ప్రొఫెషనల్స్, ఎంట్రప్రెన్యూర్ల అవసరాలకు తగినట్లుగా ఇందులో ఫీచర్లు ఉంటాయని యస్‌ బ్యాంక్‌ గ్లోబల్‌ హెడ్‌ రాజన్‌ పెంటాల్‌ తెలిపారు.

ట్రావెల్, వెల్‌నెస్, లైఫ్‌స్టయిల్‌ వంటి వివిధ విభాగాల్లో ప్రత్యేక ప్రయోజనాలు అందు కోవచ్చని పేర్కొన్నారు. ఓబెరాయ్‌ హోట ల్స్‌ నుంచి ఈ-గిఫ్ట్‌ వోచర్లు, కాంప్లిమెంటరీ గోల్ఫ్‌ సెషన్లు, ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లకు యాక్సెస్‌  పొందవచ్చని వివరించారు. ఆసి యా పసిఫిక్‌ దేశాల్లో ఈ తరహా వర ల్డ్‌ ఎలైట్‌ డెబిట్‌ కార్డును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని మాస్టర్‌ కార్డ్‌ ప్రెసిడెంట్‌ గౌతమ్‌ అగర్వాల్‌ తెలిపారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top