Xiaomi Smart Glasses: మాట్లాడేందుకు కళ్ల జోళ్లొస్తున్నాయ్‌

Xiaomi Smart Glasses Announced As A Wearable Device Concept - Sakshi

టెక్‌ యుగంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. మానవుడి జీవన విధాన్ని మరింత స్మార్ట్‌గా మార్చేస్తూ అనేక రకాల గాడ్జెట్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. ఎంతలా అంటే ఫోన్‌తో చేసే పనులు కళ్ల జోళ్ల(స్మార్ట్‌ గ్లాసెస్‌)తో చేయడం అన్నమాట. ఇప్పటికే ఆ దిశగా ఫేస్‌బుక్‌ ‘రే బాన్‌ స్టోరీస్‌’ పేరుతో స్మార్ట్‌ గ్లాసెస్‌ అమ్మకాలు ప్రారంభించింది. ఇప్పుడు ఫేస్‌బుక్‌కు పోటీగా ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ తొలిసారి 'వేరబుల్‌ డివైజ్‌ కాన్సెప్ట్‌' పేరుతో స్మార్ట్‌ గ్లాసెస్‌ను విడుదల చేయనున్నట్లు అనౌన్స్‌ చేసింది.  
షావోమీ స్మార్ట్‌ గ్లాసెస్‌ ఫీచర్స్‌


'స్పైడర్‌ మ్యాన్‌ ఫార్‌ ఫ్రం హోం' సినిమాలో స్పైడర్‌ మ్యాన్‌ పాత్రదారి పీటర్‌ పార్కర్‌ ధరించిన స్మార్ట్‌ గ్లాస్‌లా ఉండే ఈ కళ్ల జోడులో రకరకాల ఫీచర్స్‌ ఉన్నాయి.ఈ ఫీచర్లతో నోటిఫికేషన్లు సెండ్‌ చేయడం, ఫోన్‌ కాల్స్‌ మాట్లాడడం, నావిగేషన్‌, ఇమేజ్‌లను క్యాప్చర్‌ చేయడం, టెక్ట్స్‌ను ట్రాన్స్‌లేట్‌ చేసుకోవచ్చు. వీటితో పాటు బ్యాక్‌ లైటింగ్ కోసం 2.4ఎంఎంx2.02 ఎంఎం పరిమాణంలో మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే, మల్టీపుల్ కలర్స్‌ డిస్ట్రబ్‌ చేయకుండా ఒక్క కలర్‌ మాత్రమే కనపించేలా మోనోక్రోమ్ ప్యానెల్ ను డిజైన్‌ చేసింది.

అందం కనువిందుగా


180 డిగ్రీల ట్రాన్స్‌ మిట్‌ లైట్‌(కాంతి)వల్ల కళ్లకు ఎలాంటి సమస్య లేకుండా అందం కనువిందుగా కనిపించేందుకు మైక్రోలెడ్ డిస్‌ప్లే,ఫేస్‌బుక్ స్మార్ట్‌ గ్లాసెస్‌లాగే.. షావోమీ వాయిస్ అసిస్టెంట్‌ షావోఏఐ ని వినియోగించుకోవచ్చు. ఫోటోలు తీసేందుకు 5 మెగాపిక్సెల్ కెమెరా, డ్యూయల్ మైక్స్, స్పీకర్‌లు, బ్లూటూత్, వైఫై, టచ్‌ప్యాడ్, ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం క్వాడ్ కోర్ అడ్వాన్స్డ్ రిస్క్ మెషిన్‌(ఏఆర్‌ఎం) ప్రాసెసర్ను అందిస్తున్నట్లు షావోమీ తెలిపింది.

కాగా,వేరబుల్ డివైజ్ కాన్సెప్ట్ వస్తున్న ఈ స్మార్ట్‌ గ్లాసెస్‌ను షావోమీ ఎప్పుడు విడుదల చేస్తుంది. ఇంకా ఎలాంటి టెక్నాలజీని జోడించనుందనే విషయాల గురించి షావోమీ ' స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

చదవండి: ఫేస్‌బుక్‌ కళ్లద్దాలు.. ఇక ఫొటో, వీడియోలు తీయొచ్చు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top