
స్కూటర్ అంటే ఎలా ఉంటుంది అని ఎవరినైనా అడిగితే.. స్టార్ట్ చేస్తే స్టార్ అవుతుంది, మన పని అయిపోయిన తరువాత స్టాండ్ వేసి పార్కింగ్ చేసేయొచ్చు.. మనమే దానిని పూర్తిగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా (రైడర్ అవసరం లేని) ఉండేలా చైనీస్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం 'షియోమీ' (Xiaomi) ఓ స్కూటర్ తీసుకొచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
షియోమీ కంపెనీ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరి సహాయం లేకుండా.. తనకు తానుగానే ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఇది పూర్తిగా ఆటోమాటిక్. సాధారణ రోడ్ల మీద ముందుకు సాగడం మాత్రమే కాకుండా.. మెట్లపై నుంచి కూడా స్వయంగా కిందికి దిగుతుంది. పూర్తిగా రైడింగ్ చేయడం రానివాళ్లు కూడా దీనిపై చక్కర్లు కొట్టేయొచ్చు.
ఇదీ చదవండి: ఈ పాలసీతో వాహనాల ధరలు తగ్గుతాయి: నితిన్ గడ్కరీ
రైడింగ్ పూర్తయిన తరువాత తనకు తానుగానే పార్కింగ్ అవుతుంది. సేడ్ స్టాండ్ కూడా అదే హ్యాండిల్ చేసుకుంటుంది. స్టాండ్ వేయకుండా స్కూటర్ మీద కూర్చుంటే కూడా.. కిందికి పడే అవకాశం లేదు. ఇది వాయిస్ కమాండ్ కలిగి ఉంటుంది. కాబట్టి మన ఆదేశాలను కూడా పాటిస్తుంది. మొత్తం మీద షియోమీ కంపెనీ తీసుకొచ్చిన ఈ అద్భుతమైన స్కూటర్ భవిష్యత్తును మారుస్తుందేమో.. వేచి చూడాలి.
Self Driving Scooter - Xiaomi pic.twitter.com/z0P6cY1vdj
— Pankaj Parekh (@DhanValue) March 26, 2025