మరోసారి తన సత్తా చాటిన షియోమీ

Xiaomi Mi 11 launched with Snapdragon 888 - Sakshi

చైనా: షియోమీ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంఐ 11 ఫీచర్స్ ను కంపెనీ ప్రకటించింది. ఎంఐ 11 ఫ్లాగ్‌షిప్ మొబైల్ యొక్క ధర, ప్రత్యేకతలు, డిజైన్ వంటి వాటిని చైనాలో ఒక కార్యక్రమంలో విడుదల చేసారు. ప్రపంచంలో మొట్ట మొదటి సారిగా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ని ఈ మొబైల్ లో తీసుకొచ్చారు. దీంతో మరోసారి షియోమీ మొబైల్ మార్కెట్ లో తనసత్తా చాటుకుంది. కేవలం ప్రాసెసర్ పరంగా మాత్రమే కాకుండా డిజైన్, కెమెరాల వంటి వాటితో పాటు ఇతర స్పెసిఫికేషన్స్ విషయంలో కూడా భారీ మార్పులు చేసింది. అయితే గ్లోబల్ మార్కెట్ లో ఎప్పుడు తీసుకొస్తారో అనేది విషయంపై స్పష్టత ఇవ్వలేదు. (చదవండి: లీకైన గెలాక్సీ ఎస్ 21 ఫీచర్స్)

షియోమీ ఎంఐ 11 ఫీచర్స్:
షియోమీ ఎంఐ 11 మొబైల్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పంచ్-హోల్ కటౌట్ డిస్‌ప్లే తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో 6.81-అంగుళాల ఇ4 అమోలెడ్ క్యూహెచ్‌డీ+డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 5జీ ప్రాసెసర్ చేత 12జీబీ ఎల్‌పిడీడీఆర్5 ర్యామ్, 256జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయుఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో 5జీ, 4జీ ఎల్‌టీఇ, వై-ఫై 6ఇ, బ్లూటూత్ వీ 5.2, జీపీఎస్/ఎ-జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్(ఐఆర్), యుఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. 

అలాగే కెమెరాల విషయానికొస్తే ఎంఐ 11 వెనుక భాగంలో f/1.85 ఎపర్చర్‌తో 108ఎంపీ ప్రైమరీ కెమెరా, 13ఎంపీ f/2.4 ఎపర్చర్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 5ఎంపీ f/2.4 ఎపర్చర్ టెలిఫోటో-మాక్రో కెమెరాను కలిగి ఉంది. దింట్లో MEMC వీడియో ఫ్రేమ్ టెక్నాలజీ, ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజషన్ వంటివి ఉన్నాయి. ఇందులో సెల్ఫీ కోసం 20ఎంపీ కెమెరా ఉంది. ఎంఐ 11లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, హర్మాన్ కార్డాన్ స్టీరియో స్పీకర్లు, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. ఇందులో 55వాట్ వైర్డ్ ఛార్జింగ్, 50వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్, 10వాట్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్‌ చేసే 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. షియోమీ ఎంఐ 11 8జీబీ+ 128జీబీ ధర సీఎన్‌వై 3,999(సుమారు రూ.45,000), 8జీబీ + 128జీబీ వేరియంట్‌ ధర సీఎన్‌వై 4,299(సుమారు రూ.48,300), టాప్-ఎండ్ 12జీబీ+256జీబీ మోడల్ ధర సీఎన్‌వై 4,699(సుమారు రూ.52,900)గా ఉంది. ఇది బ్లూ, వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ రోజు నుంచి ప్రీ-ఆర్డర్‌ల కోసం సిద్ధంగా ఉంది. జనవరి 1న చైనాలో అమ్మకానికి రానుంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top