వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..

WhatsApp officially rolls out Always Mute option for groups chats - Sakshi

"ఆల్వేస్ మ్యూట్ '' ఆప్షన్ లాంచ్

గ్రూపు చాట్స్ కష్టాలనుంచి ఊరట

సాక్షి, న్యూఢిల్లీ:  ఫేస్ బుక్ సారధ్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ కీలక ఫీచర్‌ను తీసుకొచ్చింది. గ్రూపు చాట్స్, అలర్ట్స్ తో విసిగిపోయిన యూజర్లుకు కొత్త అప్ డేట్ అందించింది. వాట్సాప్‌లోని గ్రూప్ చాట్‌లను ఆల్వేస్ మ్యూట్ అనే ఆప్షన్ తోఎప్పటికీ మ్యూట్  చేసే ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని వాట్సాప్ తన అధికారిక ట్విటర్ లో వెల్లడించింది. చాట్‌ను ఎప్పటికీ మ్యూట్ చేయవచ్చని ట్వీట్ చేసింది. 

వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఈ ఫీచర్‌ను చివరకు లాంచ్ చేసింది. ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా ఇది అందుబాటులో ఉంది. ఈ క్రొత్త ఫీచర్ ప్రజలు ఆ ఇబ్బందికరమైన వాట్సాప్ గ్రూపులనుంచి ఎప్పటికీ ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇదిసహాయపడుతుంది. చాట్‌ను మ్యూట్ చేస్తే సంబంధిత గ్రూపులనుంచి నోటిఫికేషన్ రాదు. సందేశాలు, చిత్రాలు లేదా వీడియోలు, ఇతర ఏ ఫీడ్‌ ఇబ్బంది పెట్టదు. అంతేకాదు. అవసరమైతే దీన్ని అన్‌మ్యూటింగ్  అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు ఈ సదుపాయం ఎనిమిది గంటలు, ఒక వారం, ఒక సంవత్సరం పాటు మ్యూట్ చేయడానికి అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top